సెక్షన్లు చెప్పి చుక్కలు చూపించిన రామ్‌! - ram red movie interrogation scene
close
Published : 01/03/2021 12:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సెక్షన్లు చెప్పి చుక్కలు చూపించిన రామ్‌!

ఇంటర్‌నెట్‌: ఇటీవలే విడుదలై హీరో రామ్‌ ఖాతాలో మరో హిట్‌గా నిలిచిన చిత్రం ‘రెడ్‌’. సస్సెన్స్‌ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమాలో ఆయన‌ ద్విపాత్రాభినయంతో అలరించారు. ప్రస్తుతం ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. ఈ సందర్భంగా అందులోని కీలకమైన ఇంటరాగేషన్‌ సీన్‌ను ప్రేక్షకుల కోసం యూట్యూబ్‌లో ఉంచారు. ఇందులో రామ్‌పై పోలీసులు లాఠీఛార్జ్‌ చేయబోగా ఐపీసీలోని పలు సెక్షన్ల పేర్లు చెప్పి కారణం లేకుండా అనుమానితుడిపై చేయి చేసుకుంటే ఎలాంటి పరిణామాలు ఉంటాయో వివరిస్తాడు. దీంతో షాక్‌ అవ్వడం పోలీసుల వంతైంది. అలాగే ఈ సీన్‌కి మణిశర్మ ఇచ్చిన నేపథ్య సంగీతం ఒక రేంజ్‌లో ఉంది. స్రవంతి మూవీస్‌ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రానికి కిషోర్‌ తిరుమల దర్శకత్వం వహించగా మాళవికశర్మ, అమృతా అయ్యర్‌, నివేదా పేతురాజ్‌ హీరోయిన్లుగా నటించారు. తమిళ చిత్రం ‘తడమ్‌’ రీమేక్‌గా దీనిని చిత్రీకరిస్తున్నారు. మరి రామ్‌ చెప్పే ఆ ఐపీసీ సెక్షన్లు ఏంటో, ఆ కేసులేంటో తెలుసుకోవాలంటే ఈ సీన్‌ చూసేయండి!


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని