రామ్‌ ‘రెడ్‌’ ఓటీటీలో వచ్చేసింది! - ram red the film is now streaming on netflixindia and sunnxt
close
Updated : 23/02/2021 14:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రామ్‌ ‘రెడ్‌’ ఓటీటీలో వచ్చేసింది!

ఇంటర్నెట్‌డెస్క్‌: రామ్‌ కథానాయకుడిగా కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘రెడ్‌’. నివేదా పేతురాజు, మాళవిక శర్మ, అమృత అయ్యర్‌ కథానాయికలు. తమిళ సూపర్‌హిట్‌ ‘తడమ్‌’ను ‘రెడ్‌’ పేరు తెరకెక్కించిన సంగతి తెలిసిందే. కాగా, సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద పర్వాలేదనిపించింది. ముఖ్యంగా రామ్‌ ద్విపాత్రాభినయం, కిషోర్‌ తిరుమల టేకింగ్‌ విమర్శకులను మెప్పించింది.

థియేటర్‌లలో సందడి ముగిసిన తర్వాత ఓటీటీ/టెలివిజన్‌లో ఎప్పుడు ప్రసారమవుతుందా? అని సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ‘రెడ్‌’ను ఓటీటీ వేదికగా విడుదల చేశారు. ప్రముఖ ఓటీటీ వేదికలైన నెట్‌ఫ్లిక్స్‌, సన్‌నెక్ట్స్‌ వేదికగా ‘రెడ్‌’ స్ట్రీమింగ్‌ అవుతోంది. తన నటనతో మరోసారి అభిమానులను ఖుషీ చేసిన రామ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ఓటీటీ వేదికగా మరోసారి వీక్షించవచ్చు.Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని