Tollywood: మాస్‌ డైరెక్టర్‌తో రామ్‌ యాక్షన్‌ హంగామా? - ram team up with boyapati sreenu his next
close
Published : 30/08/2021 16:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Tollywood: మాస్‌ డైరెక్టర్‌తో రామ్‌ యాక్షన్‌ హంగామా?

ఇంటర్నెట్‌డెస్క్‌: తెరపై ఎనర్జీతో దూసుకెళ్లిపోయే నటుడు రామ్‌. ఇటు ప్రేమ కథా చిత్రాలతో పాటు, ‘ఇస్మార్ట్‌ శంకర్’ వంటి మాస్‌ మసాలా కథల్లో ఆయన ఇట్టే ఇమిడిపోతారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌లో ఓ ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది. ఓ క్రేజీ కాంబినేషన్‌ సిద్ధమయ్యేలా వార్తలు వినిపిస్తున్నాయి. రామ్‌ తన తర్వాతి చిత్రాన్ని ‘మాస్‌ కా బాస్‌’ డైరెక్టర్ బోయపాటి దర్శకత్వంలో నటిస్తారని తాజా సమాచారం. పక్కా మాస్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కించనున్నారట. అంతేకాదు, అదిరిపోయే పోరాట సన్నివేశాలు కూడా ఉంటాయని చెబుతున్నారు. దీనిపై స్పష్టత రావాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ప్రస్తుతం రామ్‌ లింగుస్వామి దర్శకత్వంలో నటిస్తున్నారు. మరోవైపు బోయపాటి బాలకృష్ణ ‘    అఖండ’ను పూర్తి చేసే పనిలో ఉన్నారు. త్వరలోనే కొత్త చిత్రంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని