ఆసక్తికర విషయాన్ని వెల్లడించిన మాస్ మహారాజ్
హైదరాబాద్: మాస్, కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించి మాస్ మహారాజ్‌గా గుర్తింపు తెచ్చుకున్న కథానాయకుడు రవితేజ. ఆయన హీరోగా నటించిన ‘క్రాక్’ సంక్రాంతిని పురస్కరించుకుని ఈ నెల 9న విడుదలై ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన తన సినీ కెరీర్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు. తాను ఎంతో అపురూపంగా భావించే ఓ చెక్‌ను అవసరాల కోసం ఖర్చు చేసినట్లు వెల్లడించారు. అదే తన మొదటి సంపాదన అని ఆయన అన్నారు.
‘అక్కినేని నాగార్జున కథానాయకుడిగా నటించిన ‘నిన్నే పెళ్లాడతా’లో నేను ఓ చిన్న పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. అయితే, అదే సినిమాకు నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాను. అందుకుగాను ఓ చెక్‌పై రూ.3500 రాసి.. నాగ్ సంతకం చేసి ఇచ్చారు. అదే నా మొదటి రెమ్యూనరేషన్. చాలారోజులపాటు ఆ చెక్‌ను భద్రంగా దాచుకున్నాను. కొంతకాలం తర్వాత అవసరాల రీత్యా డబ్బు కావాల్సిఉండడంతో చెక్‌ను బ్యాంక్‌లో మార్చేశాను’ అని రవితేజ వివరించారు. పోతరాజు వీరశంకర్ పాత్రలో రవితేజ మెప్పించిన క్రాక్ సినిమాలో ఆయనకు జంటగా శ్రుతిహాసన్ సందడి చేశారు.
ఇదీ చదవండి
రివ్య్యూ: క్రాక్
మరిన్ని
కొత్త సినిమాలు
-
‘రంగ్ దే’.. గుమ్మడికాయ కొట్టేశారు
- ‘పీఎస్పీకే 27’.. ఫస్ట్‌లుక్, టైటిల్ ఆరోజే
- ఆకట్టుకుంటోన్న ‘శ్యామ్‌సింగ్‌రాయ్’ ఫస్ట్‌లుక్!
-
నవ్వులు పూయిస్తున్న ‘షాదీ ముబారక్’ ట్రైలర్
-
పేదరికం నుంచి వెళ్లిపోవాలని ఒట్టేసుకున్నా!
గుసగుసలు
- బన్నీ ఊరమాస్ లుక్ @ మూడున్నర గంటలు
- ఎన్టీఆర్‌ను ఢీకొట్టనున్న మక్కళ్ సెల్వన్..!
- శంకర్-చరణ్ మూవీ: ఆ షరతులు పెట్టారా?
- మార్చి 15న ‘ఆర్.ఆర్.ఆర్’ అప్డేట్?
- ఆ ఇద్దరిలో ‘దళపతి 66’ దర్శకుడెవరు?
రివ్యూ
ఇంటర్వ్యూ
-
నా బ్రెయిన్లో 9 టైటానియం తీగలున్నాయి!
- ‘చెక్’ ఒక ట్రెండ్‌సెట్టర్ అవుతుంది
- డైరెక్టర్ నన్ను నమ్మితే చాలు: నందితాశ్వేత
- ఆ కల ‘శివ’తోనే తీరిపోయింది!
- ఆ హీరోతో మల్టీస్టారర్ చేయాలనుంది: నితిన్
కొత్త పాట గురూ
-
‘నిన్ను చూడకుండ’ పాట చూశారా..?
-
‘‘కోలు కోలు’’ అంటూ ఫిదా చేసిన సాయిపల్లవి
-
మోసగాళ్లు నుంచి మరో సింగిల్
-
ఇదీ.. జాతి రత్నాల కథ
-
‘చెక్’మేట్‌తో ఒక డ్యూయెట్!