Real Hero:సోనూసూద్‌ భారీ కటౌట్‌కు పాలాభిషేకం - real hero sonu sood photo showered with milk in srikalahasthi
close
Published : 21/05/2021 01:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Real Hero:సోనూసూద్‌ భారీ కటౌట్‌కు పాలాభిషేకం

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనాతో నెలకొన్న సంక్షోభ సమయంలో కష్టంలో ఉన్నవారికి నేనున్నానంటూ ధైర్యం నింపి సాయం చేస్తున్నారు ప్రముఖ సినీ నటుడు సోనూసూద్‌. దేశంలో ఏ మూలన ఎవరికి ఏ సాయం కావాలన్నా సామాజిక మాధ్యమాల్లో తెలియజేస్తే చాలు.. క్షణాల్లో పరిష్కారం చూపుతూ రియల్‌ హీరోగా ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. వలసకూలీల నుంచి కొందరు ప్రముఖుల దాకా ఎవరికి ఎలాంటి సాయం కావాలన్నా తనకు వీలైనంతగా చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. అలాంటి రియల్‌ హీరోకు చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో అభిమానులు భారీ కటౌట్‌ను ఏర్పాటు చేసి పాలాభిషేకం నిర్వహించారు. పులి శ్రీకాంత్‌ అనే వ్యక్తి నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది.  సోనూసూద్‌ను ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకొని ఇతరులకు సాయం చేయాలనే సందేశాన్ని ఇచ్చేందుకు ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ వీడియోను సోనూ సూద్‌ రీట్వీట్‌ చేస్తూ వినయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని