close
Published : 16/01/2021 00:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కేజీయఫ్‌-2 రోరింగ్‌.. ఆర్జీవీ పంచ్‌

హైదరాబాద్‌: బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని సొంతం చేసుకున్న ‘కేజీయఫ్‌’ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ‘కేజీయఫ్‌-2’ టీమ్‌పై ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ప్రశంసల వర్షం కురిపించారు. ఇటీవల విడుదలైన ‘కేజీయఫ్‌-2’ టీజర్‌కు వస్తోన్న రెస్పాన్స్‌ పట్ల ఆర్జీవీ స్పందించారు. రెండేళ్ల క్రితం బాలీవుడ్‌ మాత్రమే కాకుండా దక్షిణాది చిత్రపరిశ్రమ కూడా కన్నడ ఇండస్ట్రీని సరిగ్గా గుర్తించలేదని.. కానీ ‘కేజీయఫ్‌-2’తో ప్రశాంత్‌నీల్‌, యశ్‌ ప్రస్తుతం ఆ పరిశ్రమకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చారని ఆర్జీవీ అభిప్రాయం వ్యక్తం చేశారు.

కాగా, తెలుగు చిత్రపరిశ్రమలో తెరకెక్కిన పలు భారీ బడ్జెట్‌ చిత్రాలతో పోల్చుతూ ‘కేజీయఫ్‌2’పై వర్మ‌ పొగడ్తల వర్షం కురిపించారు. భారీ బడ్జెట్‌ చిత్రాల టీజర్లు కోట్లలో వ్యూస్‌ సాధించడానికి కొన్ని నెలల సమయం పట్టిందని.. కానీ ‘కేజీయఫ్‌-2’ టీజర్‌ మూడు రోజుల్లోనే  14 కోట్ల వ్యూస్‌ సొంతం చేసుకుందన్నారు. దీంతో మిగిలిన అన్ని చిత్రపరిశ్రమలకు ప్రశాంత్‌నీల్‌ గట్టి పంచ్‌ ఇచ్చినట్లు అయ్యిందని వర్మ తెలిపారు.

ఇదీ చదవండి

ఒక్కడే వచ్చాడు.. 100 మిలియన్‌ వ్యూస్‌ దాటేశాడు!



Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని