ఆయన సినిమాలు చూస్తే, ఆ పార్టీలో చేరతానా? - rj balaji and priya anand starer lkg telugu trailer
close
Updated : 22/06/2021 17:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆయన సినిమాలు చూస్తే, ఆ పార్టీలో చేరతానా?

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘క్రికెటర్‌ లక్ష్మణ్‌ సెంచరీ, హాఫ్‌ సెంచరీ చేసినా మీడియా అంతా ఇండియన్‌ క్రికెట్‌ ప్లేయర్‌ లక్ష్మణ్‌ సూపర్‌, ఛాంపియన్‌ అని రాస్తారు. అప్పుడు తెలుగు క్రికెటర్‌ అని రాయరు కదా! అదే ఒక మత్స్యకారుడు హత్యకు గురైతే తెలుగు మత్స్యకారుడు మృతి అని రాస్తారు ఎందుకు’ అని ప్రశ్నిస్తున్నారు ఆర్జే బాలాజీ. ఆయన కీలక పాత్రలో నటించిన తమిళ చిత్రం ‘ఎల్‌.కె.జి’. ప్రియా ఆనంద్‌ కథానాయిక. కె.ఆర్‌. ప్రభు దర్శకత్వం వహించారు.

2019లో తమిళంలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి హిట్‌ అందుకుంది. రాజకీయ వ్యంగ్య చిత్రంగా మంచి టాక్‌ తెచ్చుకుంది. ఇప్పుడు తెలుగులో ప్రముఖ ఓటీటీ ఆహా వేదికగా  ‘ఎల్‌.కె.జి.-2020’ పేరుతో జూన్ 25నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘నేను పవర్‌స్టార్‌కు అభిమానిని. ఆయన సినిమాలు చూస్తే, ఆ పార్టీలో చేరతానా’ అంటూ ఆర్జే బాలాజీ పలుకుతున్న సంభాషణలు అలరిస్తున్నాయి. ప్రస్తుత రాజకీయాలను వ్యంగ్యంగా ప్రశ్నిస్తూ సినిమాను తీర్చిదిద్దినట్లు అర్థమవుతోంది. మరి ఆ నవ్వుల పువ్వులు చూడాలంటే జూన్‌ 25 వరకూ వేచి చూడాల్సిందే!Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని