సమంత ఫిట్‌నెస్‌ సూత్రాలు..! - samantha about work outs
close
Updated : 25/09/2020 09:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సమంత ఫిట్‌నెస్‌ సూత్రాలు..!

‘నేను వ్యాయామం చేసేది దానికి కాదు’

హైదరాబాద్‌: అగ్ర కథానాయిక సమంత ఫిట్‌నెస్‌కు ఎంత ప్రాముఖ్యం ఇస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె డెడ్‌ లిఫ్ట్‌ చేసిన రోజులు కూడా ఉన్నాయి. జిమ్‌లో సామ్‌ 100 కిలోలు ఎత్తిన వీడియో ఇటీవల వైరల్‌ అయ్యాయి. ఆమెను చూసి ఫాలోవర్స్‌ కూడా స్ఫూర్తి పొందారు. తాజాగా సామ్‌ ‘యువర్‌ లైఫ్‌’కు ఇంటర్వ్యూ ఇచ్చారు. శారీరక మార్పు కోసం కసరత్తులు చేయనని, ఆనందం కోసం చేస్తానని పేర్కొన్నారు.

‘వ్యాయామం మీ జీవితాన్ని మార్చేస్తుంది. నాకు కసరత్తులు చేయడం ఎంతో ఇష్టం. నా శరీరాకృతిలో మార్పులు రావాలనే ఉద్దేశంతో నేను జిమ్‌లో కష్టపడను. నాలోని హ్యాపీ హార్మోన్లను విడుదల చేస్తుంది కాబట్టి వ్యాయామం చేయడానికి ఇష్టపడుతుంటా. కాసేపు నడిచినా మన మూడ్‌ మారుతుంది. వ్యాయామం చేయని రోజు నేను కాస్త అసంతృప్తిగా, బాధతో ఉంటాను. తరచూ కసరత్తులు చేస్తే మీ జీవితం ఇంకా బాగుంటుంది. అలవాటు పడ్డ తర్వాత మీరు కూడా వ్యాయామం సెషన్‌ కోసం ఎదురుచూస్తుంటారు’.

‘వ్యాయామం కేవలం సన్నబడటానికి చేసేది కాదు. ఫిట్‌గా, ఆనందంగా ఉండటానికి అది ఉపయోగపడుతుంది. ఇలాంటి కసరత్తులే చేయాలనే నిబంధనలు ఏమీ లేవు. మీకు ఏది నచ్చితే అదే చేయండి. ఒకప్పుడు నా శరీరం మిగిలిన వారితో పోల్చితే కాస్త సూక్ష్మంగా (చిన్నగా) ఉండేది. అందుకే కాస్త పెద్దగా కనిపించాలి అనుకున్నా. మనతోటి వాళ్లకు తగ్గట్టు ఉండాలని అనుకున్నా.. అలా నా వ్యాయామ ప్రయాణం ప్రారంభమైంది. జిమ్‌లో ఛాలెంజ్‌లు తీసుకోవడం ప్రారంభించా. లిఫ్టింగ్‌ బరువు పెంచుకుంటూ.. కసరత్తులు చేశా. ఇప్పుడు దానివల్ల నేను పవర్‌ఫుల్‌గా, బలంగా ఉన్న భావన కల్గింది’.


 

‘మీకిష్టమైన మ్యూజిక్‌ పెట్టుకుని డ్యాన్స్‌ చేసినా శరీరంలోని కొవ్వు కరుగుతుంది. మీకు ఇంట్లో ఉండటం నచ్చకపోతే.. పెంపుడు జంతువును తీసుకుని బయటికి వెళ్లండి. వాటితో కలిసి రన్నింగ్‌ చేయండి. తరచూ వ్యాయామం చేయడం మొదలుపెడితే మీలో అనేక మార్పులు వస్తాయి. మీలో స్ఫూర్తి నిండుతుంది’.

‘నాకు ఫిట్‌నెస్‌ రహస్యం అంటూ ఏదీ లేదు. తరచూ వ్యాయామం చేస్తా. కూరగాయలు, సరైన ఆహారం తీసుకుంటా. జంక్‌ఫుడ్‌ను తగ్గించేశా. బోరింగ్‌గా ఉన్నప్పుడు జిమ్‌లోకి వెళ్లి ఉత్సాహంగా వ్యాయామం చేస్తుంటా. దీని వల్ల ఆత్మస్థైర్యం కూడా పెరుగుతుంది. రోజురోజుకీ నేను దృఢంగా  ముందుకు సాగేందుకు ఇదే కారణం’ అని సామ్‌ వివరించారు.Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని