షారుఖ్‌ న్యూ ఇయర్‌ వీడియో: ఎందుకాలస్యం? - see you on the big screen in 2021 announces shah rukh khan
close
Published : 04/01/2021 01:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

షారుఖ్‌ న్యూ ఇయర్‌ వీడియో: ఎందుకాలస్యం?

ఇంటర్నెట్‌ డెస్క్: నూతన సంవత్సరం సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో బాలీవుడ్‌ బాద్‌షా చేసిన ప్రకటనతో ఆయన అభిమానుల ఎగిరి గంతేస్తున్నారు. న్యూఇయర్‌ కానుకగా తనను వెండితెరపై 2021లో చూడవచ్చంటూ షారుఖ్‌ ప్రకటించాడు. తన రాబోయే చిత్రం పేరు ‘పఠాన్‌’ అని ఆయన వెల్లడించాడు. కాగా, మూడు నిమిషాలకు పైగా సాగే ఈ కొత్త సంవత్సర వీడియో కాస్త ఆలస్యంగా విడుదలైంది. ఎందుకంటే..

యూనిట్‌ సభ్యులు అందుబాటులో లేకపోవటంతో.. దీనిని తనే షూట్‌ చేసి, తనే ఎడిట్‌ చేయటమే ఇందుకు కారణమని షారుఖ్‌ తెలిపారు. అంతేకాకుండా ఈ వీడియోలో  కనిపించే న్యూఇయర్‌ స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ కూడా తానే స్వయంగా యాడ్‌ చేశాడట. 2020 కాస్త ఘోరంగా ఉన్న మాట నిజమే కానీ.. 2021 మరింత భారీగా, ఉత్తమంగా, కాంతివంతంగా ఉంటుందని షారుఖ్‌ తన అభిమానులకు వెల్లడించాడు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని