నా మెరిసే చర్మం సీక్రెట్‌ అదే!  - seeratkapoor talks about sleep
close
Updated : 29/05/2021 15:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నా మెరిసే చర్మం సీక్రెట్‌ అదే! 

నటి సీరత్‌ కపూర్‌

‘మీకు తెలుసా.. నిద్ర కూడా అందంగా ఉండేందుకు సహకరిస్తుంది’ అని చెబుతోంది సీరత్‌ కపూర్‌. ‘రన్‌ రాజా రన్‌’తో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత విడుదలైన ‘కొలంబస్‌’, ‘ఒక్క క్షణం’, ‘మా వింత గాధ వినుమా’తోనూ అలరించింది. లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్‌ లేకుండా ఇంటికే పరిమితమైన ఆమె మహమ్మారి వేళ తన లాక్‌డౌన్‌ బ్యూటీ చిట్కాలను ఇన్‌స్టా వేదికగా పంచుకుంది. ‘‘అందంగా కనిపించడమనేది బయటి ప్రపంచానికి శ్రమతో కూడినట్టు కనిపించదు. కానీ దానికి క్రమశిక్షణ, నిలకడగా ఉండటం, శరీరంపై శ్రద్ధ వహించడం, వేళకు సరైన పోషకాహారం తినడంలాంటివి ఎంత అవసరమో.. నిద్ర కూడా అంతే అవసరం. వరుస షూటింగ్‌ కారణంగా సరైన నిద్ర ఉండేది కాదు. ఈ లాక్‌డౌన్‌లో ఎక్కువసేపు నిద్రించే అవకాశం లభించింది. రోజుకి 8 గంటల నిద్రతో వచ్చే అందం ఎలాంటి మేకప్‌ వాడినా రాదు. నిద్ర అంత సొగసుని తీసుకుస్తుంది మరి’’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రసుత్తం ఈ భామ బాలీవుడ్‌లో ‘మారిచ్‌’ చిత్రంతో పరిచయం కానుంది. నసీరుద్దీన్ షా, తుషార్‌కపూర్ ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ధ్రువ్‌ లాథెర్‌ దర్శకత్వం వహిస్తున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని