అలసటను దూరం చేసే ఈ ఆసనం వేయండి - shilpa shetty shows how to do mandukasana to combat weakness
close
Published : 01/06/2021 16:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అలసటను దూరం చేసే ఈ ఆసనం వేయండి

బాలీవుడ్‌ బ్యూటీ శిల్పాశెట్టి

బాలీవుడ్‌ పొడుగు కాళ్ల సుందరి శిల్పా శెట్టి నటనకే కాదు..ఆమె పాటించే ఫిట్‌నెస్‌కి ప్రత్యేకించి మరీ అభిమానులు ఉన్నారండోయ్‌! తన ఫ్యాన్స్‌ కూడా వ్యాయామాలు, ఆసనాలు వేయాలంటూ వీడియోలను రూపొందించి సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకుంటూ ఉంటారు. తాజాగా మండుకాసనం (ఫ్రాగ్‌ పోజ్‌) ఎలా వేయాలో చేసి చూపించారామె. ఇలా చేయడంతో మన శరీరంలో అలసటను దీటుగా ఎదుర్కొనవచ్చని చెప్పారు. ‘‘కష్టకాలమైన ఈ కొవిడ్‌ వేళ మన ఆరోగ్యంపై దృష్టి కేంద్రీకరించాలి. ఈ ఆసనం వల్ల ఎన్నో లాభాలున్నాయి. ముఖ్యంగా హీలింగ్‌ ప్రాసెస్‌ను మెరుగుపరుస్తుంది. ఇది మన నావెల్‌ సెంటర్‌ మీద ఫోకస్‌ చేయడమే కాక, మనలోని నెగెటివిటిని సైతం దూరం చేసి పాజిటివ్‌ ఎనర్జీని తీసుకొస్తుంది. తొడలు, పొట్ట భాగంలో కొవ్వు ఉన్నా తగ్గుతుంది. అయితే కీళ్లనొప్పులు, వెన్నెముక సమస్యలు ఉన్నవారు మాత్రం వీటిని ప్రయత్నించవద్దు’’ అని సూచించారు.Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని