మా అన్నయ్య వెళ్లిపోయారు: సిరివెన్నెల భావోద్వేగం - sirivennela seetharama sastry about sp balasubramaniam
close
Updated : 26/09/2020 09:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మా అన్నయ్య వెళ్లిపోయారు: సిరివెన్నెల భావోద్వేగం

హైదరాబాద్‌: ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతి పట్ల సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఈ మేరకు ఓ వీడియోను అభిమానులతో పంచుకున్నారు. ‘‘మా అన్నయ్య వెళ్లిపోయారు. మాటలను తీసుకొని వెళ్లిపోయారు. నాకు మాటలు రావడం లేదు. భారతీయ సంస్కృతిలో విడదీయలేని ఒక ముఖ్యమైన భాగం బాలు. మా అన్నయ్య మరణం దిగ్ర్భాంతికరం. ఆయన మరణం కాల ధర్మం కాదు.. అకాల  సూర్యాస్తమయం. బాలు గారు ఎంత గొప్ప గాయకుడు. సినిమా పాటకు అద్భుతమైన స్థాయి తెచ్చినటువంటి గాయకుల్లో బాలు గారు ఒకరు అవడమే కాదు.. తెలుగు సినిమా పాటకు ప్రాతినిధ్యం బాలు గారు. సినిమా పాటలకు ఆయన సంరక్షకుడు.. పెద్ద దిక్కు’’ అంటూ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గురించి భావోద్వేగంతో మాట్లాడారు. ఆ పూర్తి వీడియో మీకోసం..
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని