ఇంటర్నెట్ డెస్క్: సోనూసూద్ హీరోగా మారనున్నాడట. ఇటీవల విడుదలై ప్రేక్షకులను అలరిస్తున్న ‘క్రాక్’ను హిందీలో రీమేక్ చేయాలని భావిస్తున్నాడని తెలుస్తోంది. బీటౌన్‌లో సాగుతున్న చర్చ ఇది. ఇటీవల మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన ‘క్రాక్’ విడుదలై ప్రశంసలు అందుకుంటోంది. ఇప్పుడీ సినిమాను హిందీలో రీమేక్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయట. అందులో ప్రధానపాత్ర పోషించేందుకు సోనూసూద్ ఆసక్తిగా ఉన్నట్లు చెప్పాడట. అయితే.. దీనికి సంబంధించి ఇప్పటివరకైతే ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు. కానీ.. ‘క్రాక్’ సినిమాలో రవితేజ చేసిన పోలీస్ పాత్ర నచ్చడంతో ఈ సినిమాను ఎలాగైనా హిందీలో రీమేక్ చేయాలని సోనూ భావిస్తున్నట్లు సమాచారం. ఇటీవల.. ‘ఇక నేను విలన్ పాత్రలు చేయను.. హీరోగా చేయాలనుకుంటున్నా’ అని సోనూసూద్ చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి.
మాస్‌మహారాజ్ రవితేజ, డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వచ్చిన ‘క్రాక్’ మంచి విజయం సాధించింది. ఈ సినిమా జనవరి 9న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శృతిహాసన్ కథానాయిక. సముద్రకని, వరలక్ష్మీశరత్‌కుమార్ కీలక పాత్రల్లో నటించారు. తమన్ సంగీతం అందించాడు. మధు నిర్మాత. ఇటీవల చిత్రబృందం విశాఖపట్నంలో విజయోత్సవ సభ కూడా చేసింది.
ఇదీ చదవండి..
మరిన్ని
కొత్త సినిమాలు
- ‘సొగసు చూడ తరమా’ ఫస్ట్‌లుక్
- ‘జాతి రత్నాలు’ గుర్తుండిపోయే సినిమా: విజయ్
-
నా జీవితంలో ఇది ఒక ఆణిముత్యం
- మంచి సందేశం ఇచ్చే చిత్రమే ‘శ్రీకారం’: చిరంజీవి
-
34 ఏళ్లకు.. అనుపమ్ టాలీవుడ్ ఎంట్రీ
గుసగుసలు
- ట్రైనర్‌ను తీసుకెళ్తోన్న బన్నీ..!
- సుదీప్తో సుజిత్?
- NTR30లో రీల్ లేడీ పొలిటిషియన్?
-
కమల్ సినిమాలో ప్రతినాయకుడిగా లారెన్స్?
- మహేశ్‌బాబు వీరాభిమానిగా నాగచైతన్య..!
రివ్యూ
ఇంటర్వ్యూ
- పవన్..నేనూ హిమాలయాలకు వెళ్లిపోదామనుకున్నాం!
- నేను నటిస్తుంటే కాజల్ భయపడేది: నవీన్‌చంద్ర
-
అతనొక అమాయక ‘జాతిరత్నం’: నాగ్ అశ్విన్
-
‘శ్రీకారం’ వాస్తవానికి దగ్గరగా ఉండే చిత్రం: నరేష్
- అందుకే సీరియల్స్‌లో నటించడం లేదు: సాగర్
కొత్త పాట గురూ
-
‘పాప ఓ పాప’ వచ్చేసింది..!
-
‘అరణ్య’ నుంచి అడవి గీతం
-
మహేష్ రిలీజ్ చేసిన ‘రంగ్‌దే’ సాంగ్!
-
పునీత్ ‘పాఠశాల..’ సాంగ్ విడుదల!
-
కబడ్డీ..కబడ్డీ..సీటీమార్!