‘జగడం’ రీమేక్‌ చేయాలనుంది  - sukumar about jagadam movie
close
Updated : 16/03/2021 17:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘జగడం’ రీమేక్‌ చేయాలనుంది 

హైదరాబాద్‌: ‘‘స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌ తన సినిమాల కోసం కెమెరాకి సంబంధించిన ఏ సామాగ్రి వాడారో... ‘జగడం’ కోసం మేం కూడా అదే వాడాం. అప్పట్లో సూపర్‌ 35 ఫార్మాట్‌లో చిత్రీకరించామ’’ని తెలిపారు ప్రముఖ దర్శకుడు సుకుమార్‌. ‘జగడం’ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చి మంగళవారంతో 14ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా ఆయన ‘జగడం’ విశేషాల్ని ఓ ప్రకటనలో పంచుకున్నారు.

‘ఆర్య’ కంటే ముందు ‘జగడం’ సినిమానే చేద్దామనుకున్నానని ఆయన తెలిపారు. ‘‘రామ్‌తో సినిమా చేయాలని ఎప్పట్నుంచో ఉంది. త్వరలో తప్పకుండా చేస్తా. ఇప్పటి రామ్‌తో ‘జగడం’ రీమేక్‌ చేయాలని ఉంద’’ని సుకుమార్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన అల్లు అర్జున్‌తో ‘పుష్ప’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని