‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’తో దూసుకొస్తున్న సందీప్‌ కిషన్ - sundeep kishans A1 express climax shooting completed
close
Published : 17/11/2020 21:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’తో దూసుకొస్తున్న సందీప్‌ కిషన్

హైదరాబాద్‌: సందీప్‌ కిషన్‌, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన చిత్రం ఏ1 ఎక్స్‌ప్రెస్‌. డెన్నిస్‌ జీవన్‌ కనుకోలన్‌ దర్శకత్వంలో, టీజీ విశ్వ ప్రసాద్‌, అభిషేక్‌ అగర్వాల్‌, సందీప్ కిషన్‌, దయా పన్నెం కలిసి పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, వెంకటాద్రి టాకీస్‌ బ్యానర్‌లో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో  హాకీ ఆటగాడిగా సందీప్‌ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. 

ఈ చిత్రానికి సంబంధించిన క్లైమాక్స్‌ సీన్‌ చిత్రీకరణను చండీగఢ్‌లోని మొహాలీ స్టేడియంలో చిత్రీకరించడం విశేషం. ‘చక్‌ దే ఇండియా’, ‘సూర్మ’ వంటి చిత్రాలను ఇక్కడే చిత్రీకరించారు. 

గత సంవత్సర కాలం నుంచి ఈ చిత్రానికి పని చేస్తున్నాం. ఈ చిత్రం కోసం ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నాం. హాకీ ఆటగాడిగా సందీప్ కిషన్ ఎంతగానో ఆకట్టుకున్నారు. ‘హిప్‌ హాప్‌ తమిళ’, ‘సింగల్‌ కింగులమ్‌’ పాటలు ఇప్పటికే చాలా హిట్‌ అయ్యాయి. అంతేకాకుండా తెలుగు చలనచిత్ర రంగంలో మొట్టమొదటి హాకీ చిత్రంగా నిలుస్తుంది. అని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రానికి సందీప్‌ గత ఆరు నెలలుగా హాకీలో శిక్షణ తీసుకున్నారు. వీటికి సంబంధించిన శిక్షణ వీడియోలను సోషల్‌ మీడియాలో ఇటీవలే పంచుకున్నారు. నిజమైన హాకీ ఆటగాడిగా ఎంతో కృషి చేశారు. ఇందులోని సన్నివేశాలు చాలా అద్భుతంగా వచ్చాయి. ఈ చిత్రం త్వరలోనే థియేటర్లలో సందడి చేయనుంది అని చిత్రబృందం తెలిపింది. 
    


 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని