Suriya: 15వ పెళ్లిరోజు.. జ్యోతిక ఇచ్చిన గిఫ్ట్‌ ఇదే! - suriya jyothika 15yrs marriage anniversary
close
Published : 11/09/2021 19:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Suriya: 15వ పెళ్లిరోజు.. జ్యోతిక ఇచ్చిన గిఫ్ట్‌ ఇదే!

చెన్నై: ఆ జంటకి సినీ అభిమానుల్లో ఉండే క్రేజ్‌ వేరు. ఇద్దరూ తమ నటనతో ఫ్యాన్స్‌ మనసు ఎంత దోచుకున్నారో.. రీల్‌ లైఫ్‌, రియల్‌ లైఫ్‌లో కూడా క్యూట్‌ జంటగా అంతే పేరు తెచ్చుకున్నారు. వాళ్లే సూర్య, జ్యోతిక. 2006, సెప్టెంబరు 11న వివాహబంధంతో ఒకటైన ఈజంట..శనివారం 15ఏళ్ల వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకొన్నారు. ఈ సందర్భంగా తన సంతోషాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకున్నారు నటి జ్యోతిక. ‘‘ మీ అందరి ప్రేమ, ఆశీర్వాదాలకు నా ధన్యవాదాలు’’ అంటూ భర్త సూర్యతో దిగిన ఫొటోను పోస్ట్‌ చేశారు. అంతే కాదు.. ‘అంజాన్‌’ చిత్రంలో సూర్య కనిపించిన లుక్‌తో పాటు రెండు సింహాలు కౌగిలించుకున్న ఓ పెన్సిల్‌ స్కెచ్‌ గీసి సూర్యకు అంకితమిచ్చారు.‘‘ నా భర్త, నా సహనటుడు, నాకు మరో అమ్మ, మరీ ముఖ్యంగా నా బెస్ట్‌ ఫ్రెండ్‌.. మన 15వ పెళ్లిరోజు సందర్భంగా నా సింగంకి నేను ఇచ్చే ఓ చిన్న కానుక’’ అంటూ ఆమె గీసిన చిత్రాలను పోస్టు చేశారు. 

 





మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని