Ram: మరో షెడ్యూల్‌ ముగిసింది - telugu news Another Key Schedule Of ram linguswamy Movie Completed
close
Updated : 18/10/2021 07:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Ram: మరో షెడ్యూల్‌ ముగిసింది

రామ్‌ కథానాయకుడిగా లింగుస్వామి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. కృతి శెట్టి కథానాయిక. ఆది పినిశెట్టి, అక్షర గౌడ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం.. తాజాగా రెండో షెడ్యూల్‌ను పూర్తి    చేసుకుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం సామాజిక  మాధ్యమాల ద్వారా పంచుకుంది. ఇటీవల జిమ్‌లో   కసరత్తులు చేస్తూ.. రామ్‌ స్వల్పంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ తాజా షెడ్యూల్‌లో ఆయనెక్కువ పాల్గొనలేదు. విలన్‌గా నటిస్తున్న ఆది పినిశెట్టికి సంబంధించిన కీలక   సన్నివేశాల్నే ఎక్కువ చిత్రీకరించినట్లు తెలిసింది. రామ్‌ గాయం నుంచి కోలుకోగానే కొత్త   షెడ్యూల్‌ను ప్రారంభించనున్నట్లు సమాచారం. మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా లింగుస్వామి ఈ చిత్రం తెరకెక్కిస్తున్నారు. ఇందులో రామ్‌ పోలీస్‌గా సందడి చేయనున్నట్లు  తెలుస్తోంది. సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌, మాటలు: సాయిమాధవ్‌ బుర్రా, ఛాయాగ్రహణం: సుజీత్‌ వాసుదేవ్‌.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని