RC15: పాటతో మొదలు - telugu news RC15 Regular Shoot Commence From Oct 22
close
Updated : 20/10/2021 07:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

RC15: పాటతో మొదలు

రామ్‌చరణ్‌ - శంకర్‌ కలయికలో రూపొందుతున్న సినిమా పట్టాలెక్కనుంది. ఈ నెల 22న పుణెలో చిత్రీకరణ మొదలు పెట్టనున్నారు. ఇప్పటికే కొబ్బరికాయ కొట్టుకున్న ఈ చిత్రం తొలి షెడ్యూల్‌ 20 రోజులపాటు  సాగనున్నట్టు తెలిసింది. పాటతో చిత్రీకరణ మొదలవనుంది. ఆ విషయాన్ని కథానాయిక కియారా అడ్వాణీ స్వయంగా వెల్లడించారు. శంకర్‌ సినిమాల్లో పాటలకి ఉండే ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. భారీ హంగులతో సెట్స్‌ని తీర్చిదిద్ది అందులో చిత్రీకరణ చేస్తుంటారు. ఇందులోని పాటల్నీ అదే తరహాలో తెరకెక్కించనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో రామ్‌చరణ్‌ యువ ఐఏఎస్‌ అధికారిగా కనిపిస్తారని సమాచారం. దిల్‌రాజు నిర్మిస్తున్నారు. తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని