Tollywood Drugs Case: ముగిసిన నవదీప్‌ ఈడీ విచారణ - telugu news actor navadeep ed investigation completed
close
Updated : 13/09/2021 21:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Tollywood Drugs Case: ముగిసిన నవదీప్‌ ఈడీ విచారణ

హైదరాబాద్‌: తెలుగు చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టిస్తున్న మాదకద్రవ్యాల కేసులో మనీలాండరింగ్‌కు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారణ కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే నటుడు నవదీప్‌ ఈ విచారణకు సోమవారం హాజరయ్యారు. దాదాపు 9 గంటలపాటు నవదీప్‌ని ఈడీ అధికారులు ప్రశ్నించారు. నవదీప్‌ బ్యాంకు ఖాతాలకు సంబంధించి అనుమానాస్పద లావాదేవీలు, మాదకద్రవ్యాల సరఫరాదారు కెల్విన్‌తో సంబంధాలు, తదితర విషయాల గురించి ఆరా తీశారు. అవసరమైనప్పుడు అందుబాటులో ఉండాలని ఈడీ అధికారులు నవదీప్‌ను ఆదేశించినట్టు సమాచారం. నవదీప్‌తోపాటు ఎఫ్‌ క్లబ్‌ జి. ఎం. విక్రమ్‌పైనా ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. ఇప్పటికే డ్రగ్స్ విక్రేత కెల్విన్‌తో పాటు సినీ ప్రముఖులు పూరీ జగన్నాథ్‌, ఛార్మి, రకుల్‌, నందు, రవితేజ, రానాను విచారించిన అధికారులు వారి వద్ద నుంచి కీలక విషయాలు రాబట్టారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని