NTR: తారక్‌ కొత్త కారు.. సోషల్‌ మీడియాలో వైరల్‌! - telugu news actor ntr new car spotted at ram charan house
close
Published : 23/07/2021 19:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

NTR: తారక్‌ కొత్త కారు.. సోషల్‌ మీడియాలో వైరల్‌!

హైదరాబాద్‌: ఎన్టీఆర్‌కి కార్లంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే ఆయన గ్యారేజీలో పలు కార్లుండగా.. లంబోర్గినీ కంపెనీకి చెందిన లేటెస్ట్‌ మోడల్‌ కారు ఇటీవల ఆ జాబితాలో చేరింది. అయితే అది ఎలా ఉంటుందో అని ఎదురుచూసిన తారక్‌ అభిమానులకు ఆ సర్‌ప్రైజ్‌ అందింది. తారక్‌ కారుని చూడగానే ఓ అభిమాని క్లిక్‌మనిపించి సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకున్నాడు. ప్రస్తుతం నెట్టింట ఆ కారు ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి. నారింజ రంగులో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రామ్‌చరణ్‌ ఇంటికి ఈ కారులో రాగా, ఆయన అభిమానులు క్లిక్‌మనిపించారు. చెర్రీ, తారక్‌ కలిసి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంతో నటిస్తోన్న సంగతి తెలిసిందే. కొమురం భీంగా తారక్‌, అల్లూరి సీతారామరాజుగా రామ్‌ చరణ్‌ కనిపించనున్నారు. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. అక్టోబరు 13న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇది పూర్తయ్యాక కొరటాల శివ దర్శకత్వంలో నటించనున్నారు ఎన్టీఆర్‌. తమిళ దర్శకుడు శంకర్‌తో ఓ చిత్రం చేయనున్నారు రామ్‌ చరణ్‌. 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని