Tollywood Drugs Case: తరుణ్‌ను 7 గంటలపాటు ప్రశ్నించిన ఈడీ అధికారులు - telugu news actor tarun investigation with ed
close
Published : 22/09/2021 18:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Tollywood Drugs Case: తరుణ్‌ను 7 గంటలపాటు ప్రశ్నించిన ఈడీ అధికారులు

హైదరాబాద్‌: టాలీవుడ్‌ మాదకద్రవ్యాల కేసులో ఈడీ విచారణకు బుధవారం ఉదయం నటుడు తరుణ్‌ హాజరైన సంగతి తెలిసిందే. సుమారు 7 గంటలపాటు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు ఆయన్ను ప్రశ్నించారు. మనీలాండరింగ్‌ కోణంలో తరుణ్‌ బ్యాంక్ ఖాతాలను పరిశీలించారు. అనుమానాస్పద లావాదేవీల గురించి ఆరా తీశారు. డ్రగ్స్‌ విక్రేత కెల్విన్‌తో ఉన్న సంబంధాల గురించి ప్రశ్నించినట్లు సమాచారం.

మనీ లాండరింగ్‌ కోణంలో 12 మంది సినీ ప్రముఖులకు నోటీసులిచ్చిన ఈడీ.. గత కొన్ని రోజుల నుంచి వారిని ప్రశ్నిస్తోంది. ఇప్పటివరకు పూరీ జగన్నాథ్‌, రానా, ఛార్మి, నవదీప్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, రవితేజ.. ఇలా మొత్తం 11 మంది సెలబ్రిటీలను ఈడీ సుధీర్ఘంగా విచారించి.. వారి వద్ద నుంచి కీలక సమాచారం రాబట్టింది.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని