Bigg boss 5: ఉగ్ర స్వరూపం చూపిస్తా.. మస్తు చూసేసినా.. సన్నీ VS ప్రియ! - telugu news after effect of nominations here the situation in bigg boss house
close
Updated : 19/10/2021 17:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Bigg boss 5: ఉగ్ర స్వరూపం చూపిస్తా.. మస్తు చూసేసినా.. సన్నీ VS ప్రియ!

హైదరాబాద్‌: సోమవారం ముగిసిన నామినేషన్ ప్రక్రియపై హౌస్ మేట్స్ మధ్య చర్చ జరిగింది. ‘నీకు దమ్ముంటే గేమ్ ఆడు. సేఫ్ గేమ్ ఆడకు’ అంటూ ప్రియాంక చెపుతోంది. ‘నీకు వచ్చిన పవర్‌తో నీ ఫ్రెండ్స్‌ని కాపాడుకోవాలనుకున్నపుడు, నీ ప్రత్యర్థిని కూడా ఎలిమినేట్ చేసుకోవచ్చు కదా’ అంటూ.. సన్నీకి మానస్ హితబోధ చేస్తున్నాడు. ‘వాళ్లు ఆడితే గేమ్‌.. నేడు ఆడితే క్రైమా?’ అంటూ సన్నీ ప్రశ్నించాడు. ‘చేసిన తప్పు ఒప్పుకోడు’ అని రవి అనగా, ‘వీడు తప్పు చేయలేదు రవి, ఫ్రెండ్ కోసం ఫ్రెండ్‌ని సేవ్ చేయడానికి నేను నిన్ను నామినేట్ చేస్తున్నా అంతే’ అని కాజల్‌ అనేసరికి రవి నోరెళ్ల బెట్టాడు. ఇక బిగ్‌బాస్‌ ఈ వారం కెప్టెన్ కంటెండర్స్‌కి బంగారు కోడిపెట్ట టాస్క్ ఇచ్చాడు.. ఈ సందర్భంగా సన్నీ, ప్రియల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఇక శ్రీరామ్‌-సిరి కలిసి ఆడటం చూసి, షణ్ముఖ్‌ కుళ్లుకున్నాడు. ‘మా ఇద్దరినీ అలా ఎలా అంటావు’ అని సిరి అడిగితే, ‘చాలా చూశాను. నాకు అలా అనిపిస్తుంది’ అంటూ సమాధానం ఇచ్చాడు. మరి ఈ టాస్క్‌లో గెలిచి ఎవరు కొత్త కెప్టెన్ అయ్యారో తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.




Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని