దాసరి అరుణ్‌కుమార్‌పై అట్రాసిటీ కేసు  - telugu news case filed on dasari arun kumar
close
Published : 19/08/2021 01:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దాసరి అరుణ్‌కుమార్‌పై అట్రాసిటీ కేసు 

హైదరాబాద్‌: ప్రముఖ దర్శకుడు దివంగత దాసరి నారాయణరావు రెండో కుమారుడు అరుణ్‌కుమార్‌పై అట్రాసిటీ కేసు నమోదైంది. తనని కులం పేరుతో దుర్భాషలాడారని బ్యాగరి నర్సింహులు వెంకటేశ్‌ అనే వ్యక్తి బంజారాహిల్స్‌ పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు అనంతరం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ‘బొల్లారం ప్రాంతానికి చెందిన బ్యాగరి నర్సింహులు వెంకటేశ్‌.. దాసరి నారాయణరావు వద్ద 2012 నుంచి 2016 వరకు పనిచేశారు. ఆ సమయంలో దాసరి తనయులు ప్రభు, అరుణ్‌కుమార్‌లతో వెంకటేశ్‌కి పరిచయం మొదలైంది. ఈ క్రమంలో వీరి మధ్య ఓ ఒప్పందం కుదిరింది. దాసరి నారాయణరావు మరణాంతరం ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకుని, కొత్త ఒప్పందం చేసుకున్నారు. ఈ మేరకు తనకి రావాల్సిన డబ్బులు ఇవ్వమని వెంకటేశ్‌ కోరగా తాను ఒప్పందంపై సంతకం చేయలేదని అరుణ్‌కుమార్‌ అన్నారు. కులంపేరుతో వెంకటేశ్‌ని దూషించారు. ఈ ఘటన ఆగస్టు 13న ఫిలింనగర్‌లోని ఎఫ్‌.ఎన్‌.సి.సి. క్లబ్‌ వద్ద చోటుచేసుకుంది. దీంతో తనకు ప్రాణహాని ఉందని, ఈ నెల 16న వెంకటేశ్‌ ఫిర్యాదు చేశారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని