SP Balu: బాలు పాటతో ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తోన్న దుబాయ్‌ షేక్‌ - telugu news dubai sheik sings sp balu song video viral
close
Published : 09/09/2021 01:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

SP Balu: బాలు పాటతో ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తోన్న దుబాయ్‌ షేక్‌

హైదరాబాద్‌: లెజండరీ సింగర్‌, గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాట అంటే ఇష్టపడని వారుండరు. ఆయన పాటకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. కొన్నివేల పాటలు ఆలపించిన బాలు అనారోగ్యంతో గతేడాది కన్నుమూసినప్పటికీ.. పాట రూపంలో ఆయన ఇంకా మన మధ్యే జీవించి ఉన్నారు. అందుకు నిదర్శనమే ఈ వీడియో. ఎస్పీబీ ఆలపించిన పాటల్లో ఒక మధురమైన పాటను ఓ దుబాయ్‌ షేక్‌ అలవోకగా ఆలపించి.. అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశారు.

కె.విశ్వనాథ్‌ తెరకెక్కించిన సంగీత ప్రధాన దృశ్యకావ్యం ‘సిరివెన్నెల’. కె.వి.మహదేవన్‌ సంగీతం అందించిన ఈ సినిమాలోని ప్రతి పాట ఓ ఆణిముత్యం. ముఖ్యంగా ‘విధాత తలపున..’ అంటూ సాగే పాటను తన గానంతో ఎస్పీబాలు మరోస్థాయికి తీసుకువెళ్లారు. తాజాగా ఇదే పాటను దుబాయ్‌కు చెందిన ఓ షేక్‌ ఆలపించారు. దీనికి సంబంధించిన వీడియోని ఆయన టిక్‌టాక్‌లో షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. సంగీతంపట్ల ఆయనకు ఉన్న అభిరుచికి తెలుగు సినీ ప్రియులు ఫిదా అవుతున్నారు.




Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని