Mahesh Babu: విలన్లని కొట్టొచ్చాడు. ఆ వెంటనే మేం కలిశాం.. - telugu news mp sashi tharoor met actor mahesh babu
close
Published : 09/09/2021 01:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Mahesh Babu: విలన్లని కొట్టొచ్చాడు. ఆ వెంటనే మేం కలిశాం..

హైదరాబాద్‌: ప్రముఖ నటుడు మహేశ్‌బాబు హీరోగా నటిస్తోన్న చిత్రం ‘సర్కారు వారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం నగరంలోని ఓ ప్రముఖ హోటల్‌లో యాక్షన్‌ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్‌ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్‌ అక్కడికి చేరుకున్నారు. మహేశ్‌ని కలిసి, కాసేపు సరదాగా ముచ్చటించారు. సోషల్‌ మీడియా వేదికగా ఆ విశేషాల్ని పంచుకున్నారు. ‘మహేశ్‌బాబు ఇప్పుడే తన సినిమాలోని విలన్లని కొట్టొచ్చాడు. ఆ వెంటనే మేం కలిశాం. మహేశ్‌ని కలవడం చాలా సంతోషంగా ఉంది’ అని తెలిపారు. శశిథరూర్‌తోపాటు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ ఉన్నారు. పార్లమెంటరీ స్థాయి సంఘం కార్యక్రమాల్లో భాగంగా శశిథరూర్‌ ఇటీవల హైదరాబాద్‌ విచ్చేసిన సంగతి తెలిసిందే.

 

 




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని