Bigg Boss Telugu 5: ‘బిగ్‌బాస్‌’ నుంచి ప్రియ ఎలిమినేట్‌ - telugu news priya eliminated from bigg boss
close
Published : 25/10/2021 01:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Bigg Boss Telugu 5: ‘బిగ్‌బాస్‌’ నుంచి ప్రియ ఎలిమినేట్‌

హైదరాబాద్‌: ‘బిగ్‌బాస్‌ సీజన్‌-5’ ఏడోవారం హౌజ్‌ నుంచి ఎవరు ఎలిమినేట్‌ కానున్నారనే ఉత్కంఠకు తెరపడింది. ఈవారం నామినేషన్స్‌లో ప్రియ, యానీ మాస్టర్, లోబో, జెస్సీ, రవి, శ్రీరామ్, కాజల్, సిరి ఉండగా.. ప్రియ ఎలిమినేట్‌ అయింది. అతి తక్కువ ఓట్లు రావడంతో ఆమె ఇంటి నుంచి ఎలిమినేట్‌ అయిందని కార్యక్రమ వ్యాఖ్యాత, నటుడు నాగార్జున తెలిపారు. ‘బిగ్‌బాస్‌’ ఇచ్చిన టాస్కుల్లో యాక్టివ్‌గా ఉండకపోవడం, కాజల్‌ని హేళన చేస్తూ మాట్లాడటం, సన్నీతో గొడవపడటం తదితర అంశాలు ప్రియకి కలిసిరాలేదని చెప్పొచ్చు. ముఖ్యంగా ఆమె వ్యవహార శైలి మైనస్‌ పాయింట్‌ అయిందనేది కొందరి అభిప్రాయం. ఇటీవల ఎపిసోడ్‌లో ‘చెంప పగలకొడతా’ అంటూ సన్నీపై కోపం ప్రదర్శించడంతో ఇంటి సభ్యులతోపాటు ప్రేక్షకులూ ఆమెపై అసంతృప్తితో ఉన్నారు. ఈ పరిణామాలతో ఆమెకు తక్కువ ఓట్లు పడ్డాయని తెలుస్తోంది.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని