RAM: రామ్‌కు గాయం.. షూటింగ్‌ వాయిదా - telugu news ram next movie shoot halted due to injury
close
Published : 04/10/2021 12:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

RAM: రామ్‌కు గాయం.. షూటింగ్‌ వాయిదా

హైదరాబాద్‌: హీరో రామ్‌పోతినేనికి స్వల్ప గాయమైంది. ప్రముఖ దర్శకుడు లింగుస్వామి డైరెక్షన్‌లో తెరకెక్కనున్న సినిమా కోసం వర్కౌట్లు చేస్తుండగా జిమ్‌లో ఆయన గాయపడ్డాడు. రామ్‌ మెడకు స్వల్పగాయం కావడంతో సినిమా షూటింగ్‌ను వాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది. యాక్షన్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈసినిమాలో రామ్‌ పవర్‌ఫుల్‌ పోలీస్‌ అధికారిగా కనిపించనున్నారు. ఇందులో రామ్‌ సరసన కృతిశెట్టి సందడి చేయనున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్ర్కీన్‌ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం ‘రాపో 19’గా ప్రచారంలో ఉంది.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని