Romantic: ‘రొమాంటిక్‌’గా ఉంది: ప్రభాస్‌ - telugu news romantic Trailer Launched By Prabhas
close
Updated : 20/10/2021 07:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Romantic: ‘రొమాంటిక్‌’గా ఉంది: ప్రభాస్‌

కాష్‌ పూరి, కేతికా శర్మ జంటగా అనిల్‌ పాడూరి తెరకెక్కించిన చిత్రం ‘రొమాంటిక్‌’. పూరి కనెక్ట్స్‌ పతాకంపై పూరి జగన్నాథ్‌, ఛార్మి సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా ఈనెల 29న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం హీరో ప్రభాస్‌ ఈ చిత్ర ట్రైలర్‌ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘టైటిల్‌కు తగ్గట్లుగానే ట్రైలర్‌ చాలా రొమాంటిక్‌గా ఉంది. ఆకాష్‌ అద్భుతంగా  నటించాడు. తను తొలి  సినిమాకీ.. ఇప్పటికీ చాలా పరిణతి చెందాడు. రమ్యకృష్ణ  ఎప్పటిలాగే అద్భుతంగా నటించారు’’ అన్నారు. ‘‘సినిమాలో ఆకాష్‌, కేతికా శర్మల మధ్య కెమిస్ట్రీ చాలా బాగా కుదిరింది. ఇందులో ‘‘డార్లింగ్‌..’ అంటూ సాగే ఓ ప్రత్యేక గీతముంది’’ అంది ఛార్మి. పూరి జగన్నాథ్‌ మాట్లాడుతూ.. ‘‘డార్లింగ్‌ ప్రభాస్‌ ఈ చిత్ర ట్రైలర్‌ విడుదల చేయడం ఆనందంగా ఉంది. సినిమా విడుదలని తెలిశాక..

ఫోన్‌ చేసి మరీ మూవీ గురించి ఏమన్నా ట్వీట్‌ వేయాలా? ఇంటర్వ్యూ ఇవ్వాలా? అని అడిగారు. ప్రభాస్‌ అంత మంచి వాడు’’ అన్నారు. ఇక ట్రైలర్‌ విషయానికొస్తే... స్వచ్ఛమైన ప్రేమకు, శరీరాన్ని చూసి పుట్టే ప్రేమకు మధ్య తేడాని ఈ సినిమాలో చూపించినట్లు తెలుస్తోంది. రమ్యకృష్ణ ఓ శక్తిమంతమైన పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించింది. ఆఖర్లో ఆకాష్‌ పోలీస్‌ గెటప్‌లో కనిపించడం చూస్తే.. ‘పోకిరి’ తరహాలో ఏదో ట్విస్ట్‌ ఉన్నట్లు అర్థమవుతోంది. ఈ చిత్రానికి సంగీతం: సునీల్‌ కశ్యప్‌, ఛాయాగ్రహణం: నరేష్‌.



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని