SIIMA2019: ఉత్తమ నటుడు, నటి, దర్శకుడు.. పోటీలో నిలిచింది వీరే!  - telugu news siima nominations for best actor actress director
close
Updated : 22/08/2021 19:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

SIIMA2019: ఉత్తమ నటుడు, నటి, దర్శకుడు.. పోటీలో నిలిచింది వీరే! 

ఇంటర్నెట్‌ డెస్క్‌: దక్షిణాది సినీ నటులు ప్రతిష్టాత్మకంగా భావించే సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌ (సైమా) వేడుక మరికొన్ని రోజుల్లో సందడి చేయనుంది. హైదరాబాద్‌ వేదికగా సెప్టెంబరు 11,12 తేదీల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. 2019 సంవత్సరానికి సంబంధించి ఈ అవార్డులకు నామినేట్‌ అయిన నటుడు, నటి, దర్శకుల వివరాల్ని సైమా తాజాగా ప్రకటించింది. టాలీవుడ్‌ నుంచి ఉత్తమ నటుడి జాబితాలో .. మహేశ్‌ బాబు (మహర్షి), రామ్‌ (ఇస్మార్ట్‌ శంకర్‌), నాగ చైతన్య (మజిలీ), వరుణ్‌ తేజ్‌ (గద్దలకొండ గణేశ్‌), నాని (జెర్సీ), నవీన్‌ పొలిశెట్టి (ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ) నిలిచారు. పూజా హెగ్డే (మహర్షి),  సమంత (ఓ బేబీ), శ్రద్ధా శ్రీనాథ్‌ (జెర్సీ), రష్మిక (డియర్‌ కామ్రేడ్‌), రాశీఖన్నా (ప్రతిరోజు పండగే) ఉత్తమ నటి అవార్డుకి పోటీ పడుతున్నారు. బెస్ట్‌ డైరెక్టర్‌గా వంశీ పైడిపల్లి (మహర్షి), నందిని రెడ్డి (ఓ బేబీ), పూరి జగన్నాథ్‌ (ఇస్మార్ట్‌ శంకర్‌), అనిల్‌ రావిపూడి (ఎఫ్‌ 2), గౌతమ్‌ తిన్ననూరి (జెర్సీ), శివ నిర్వాణ (మజిలీ) పోటీ పడుతున్నారు. తెలుగుతోపాటు కన్నడ, తమిళ, మలయాళ భాషలకు సంబంధించిన నామినేషన్లూ వెలువడ్డాయి. వాటిపై ఓ లుక్కేయండి.. 













Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని