Tollywood Drugs case: పూరి జగన్నాథ్‌, తరుణ్‌ నమూనాల్లో డ్రగ్స్‌ ఆనవాళ్లు లేవు: ఎఫ్ఎస్‌ఎల్‌ - telugu news tollywood drugs case fsl report
close
Updated : 18/09/2021 16:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Tollywood Drugs case: పూరి జగన్నాథ్‌, తరుణ్‌ నమూనాల్లో డ్రగ్స్‌ ఆనవాళ్లు లేవు: ఎఫ్ఎస్‌ఎల్‌

హైదరాబాద్‌: దర్శకుడు పూరి జగన్నాథ్‌, నటుడు తరుణ్‌ నుంచి సేకరించిన నమూనాల్లో డ్రగ్స్‌ ఆనవాళ్లు లేవని ఎఫ్ఎస్‌ఎల్‌ నివేదికలో తేలింది. పూరి, తరుణ్‌కు సంబంధించిన రక్తం, వెంట్రుకలు, గోళ్లను పరీక్షించిన రాష్ట్ర ఫోరెన్సిక్‌ లేబొరేటరీ ఈ మేరకు నివేదిక విడుదల చేసింది. డ్రగ్స్‌ కేసులో ఆరోపణలు రావడంతో 2017 జులైలో పూరి జగన్నాథ్‌, తరుణ్ నుంచి ఎక్సైజ్‌శాఖ నమూనాలు సేకరించింది. స్వచ్ఛందంగానే ఇద్దరూ రక్తం, గోళ్లు, వెంట్రుకల నమూనాలు ఇచ్చారని ఎక్సైజ్‌ అధికారులు వెల్లడించారు. దీనిపై గతేడాది డిసెంబరు 8న ఎఫ్ ఎస్‌ఎల్‌ నివేదికలు సమర్పించినట్టు ఎక్సైజ్‌శాఖ తెలిపింది. కెల్విన్‌పై ఛార్జ్‌షీట్‌తో పాటు ఎఫ్ఎస్‌ఎల్‌ నివేదిక వివరాలను కోర్టుకు సమర్పించినట్టు ఎక్సైజ్‌ అధికారులు వివరించారు.  ఎఫ్‌ఎస్‌ఎల్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ వాంగ్మూలాన్ని కూడా ఎక్సైజ్‌శాఖ కోర్టుకు సమర్పించింది.



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని