పవన్‌కల్యాణ్‌.. శృతిహాసన్‌.. ఫొటో లీక్‌ - vakeel saab leaked photos
close
Published : 21/12/2020 01:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పవన్‌కల్యాణ్‌.. శృతిహాసన్‌.. ఫొటో లీక్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘వకీల్‌సాబ్‌’లో లీకుల పర్వం కొనసాగుతూనే ఉంది. పవర్‌స్టార్‌ సినిమా అంటేనే అంచనాలు ఎక్కువగా ఉంటాయి. పవన్‌ సినిమా ప్రకటించింది మొదలు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. షూటింగ్‌ ఎంత వరకు వచ్చింది..? అసలు ఈ సినిమాలో పవర్‌స్టార్‌ లుక్‌ ఎలా ఉండబోతుంది.? ఇలాంటి విషయాలు తెలుసుకోవాలని ఆతృతగా ఎదురుచూస్తుంటారు. అందుకే చిత్రబృందం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. వరుసగా ఫొటోలు లీక్‌ అవుతూనే ఉన్నాయి. ఇటీవల పవర్‌స్టార్‌ ఫొటో ఒకటి బయటికి వచ్చిన విషయం తెలిసిందే.. తాజాగా మరో ఫొటో లీక్‌ అయింది. అయితే.. ఈ ఫొటో ఓ పాట చిత్రీకరణ సందర్భంగా తీసినట్లు తెలుస్తోంది. అందులో హీరోహీరోయిన్లు ఒకరి చేయి ఒకరు పట్టుకొని కనిపిస్తున్నారు.

వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్‌ కల్యాణ్‌ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. కథానాయిక శృతిహాసన్‌. పవన్‌, శృతి కాంబినేషన్‌లో ఇది మూడో చిత్రం. ఇప్పటికే ‘గబ్బర్‌సింగ్‌’, ‘కాటమరాయుడు’ సినిమాల్లో ఇద్దరూ కలిసి కనిపించారు. కాగా.. హిందీలో వచ్చి మంచి విజయం సాధించిన ‘పింక్‌’ చిత్రానికి తెలుగు రీమేక్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తమన్‌ స్వరాలు అందిస్తున్నారు. దిల్‌రాజు, బోనీకపూర్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ ఏడాది ఆరంభంలో విడుదలైన ‘మగువా మగువా’ సాంగ్‌ ప్రేక్షకులను బాగా అలరించింది.

ఇదీ చదవండి..

ఆన్‌లైన్‌లో లీకైన ‘వకీల్‌సాబ్‌’ ఫొటోలు..!

 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని