ఆ రోజు చాలా కోపం వచ్చింది: విద్యుల్లేఖ - vidyullekha raman emotional post
close
Published : 09/09/2020 12:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ రోజు చాలా కోపం వచ్చింది: విద్యుల్లేఖ

20 కేజీలు తగ్గాక.. నటి భావోద్వేగపు పోస్ట్‌

హైదరాబాద్‌: సహాయ నటి విద్యుల్లేఖ రామన్ లాక్‌డౌన్‌ కాలంలో పట్టుదలతో కసరత్తులు చేసి బరువు తగ్గిన విషయం తెలిపారు. ఆమె అంకితభావాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అయితే ఎందుకు బరువు తగ్గాలి అనిపించింది?, లావుగా ఉండటం వల్ల ఎదుర్కొన్న సమస్యల గురించి విద్యుల్లేఖ తాజాగా పంచుకున్నారు. ‘86.5 కేజీల నుంచి 65.2 కేజీలకు చేరా. అంటే 20+ కేజీలు తగ్గా. ఇది శ్రమ, కన్నీరు, మలుపులతో కూడుకున్న దూర ప్రయాణం. నేను షేర్‌ చేసిన ఫొటోలో ఎడమవైపు ఉన్న పిక్చర్‌ చూసినప్పుడు.. అలా ఉండకూడదు, ఆరోగ్యంగా ఉండాలి అనుకున్నా. ఆ ఫొటో తీసుకున్న రోజు నాకు ఇంకా గుర్తుంది. ఓ తమిళ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం జరుగుతోంది. ఆ వేడుకకు వెళ్లడానికి నాకు సరిపోయే దుస్తులు దొరకలేదు. నా వద్ద ఉన్న ఒక్క డ్రెస్‌ కూడా సరిపోలేదు. అందుకే లెగ్గిన్‌ వేసుకుని.. ఆ షేమ్‌ను దాచడానికి‌ పైన కోటులాంటిది వేసుకున్నా’.

‘ఆ రోజు మానసిక ఒత్తిడితోపాటు నాపై నాకే చాలా కోపం వచ్చింది. ‘బాధపడ్డది చాలు.. నేనెందుకు సన్నగా ఉండాలి. నాకు దాని అవసరం లేదు, రాదు’ అని నాలో నేను అనుకున్నా. కానీ అదృష్టవశాత్తు ఫిబ్రవరి 2019న కొన్ని అనుభవాల వల్ల నాలో నేనే స్ఫూర్తి నింపుకున్నా. ‘ఇక చాలు.. నేను ఆరోగ్యంగా, ఫిట్‌గా తయారు కావాలి’ అని నా మనసుకు చెప్పుకున్నా. ఆపై నాలో వచ్చిన తేడాను ఈ ఫొటోలో మీరే చూడొచ్చు. ఏదైనా మన కోసం చేయాలి’ అని ఆమె ఎమోషనల్‌ పోస్ట్‌ చేశారు. మరోపక్క ఆగస్టు 26న విద్యుల్లేఖ రోకా వేడుక జరిగింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు ఆమె చెప్పారు. త్వరలోనే వివాహ వేడుక జరగబోతోంది.Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని