హీరో విజయ్‌కు రూ.లక్ష జరిమానా - vijay fined rs 1 lakh for seeking tax exemption
close
Published : 13/07/2021 17:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

హీరో విజయ్‌కు రూ.లక్ష జరిమానా

చెన్నై: తమిళ హీరో విజయ్‌కు మద్రాస్‌ హైకోర్టులో చుక్కెదురైంది. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న తన రోల్స్‌ రాయిస్‌ ఘోస్ట్‌ కారు కేసులో న్యాయస్థానం ఆయనకు జరిమానా విధించింది. ఇంగ్లాండ్‌ నుంచి దిగుమతి చేసుకున్న ఈ లగ్జరీ కారుకు పన్ను కట్టనందుకు గానూ హైకోర్టు రూ.లక్ష జరిమానా విధించింది. దాదాపు రూ. 7.95కోట్ల విలువైన ఈ రోల్స్‌ రాయిస్‌ ఘోస్ట్‌ కారుకు పన్ను మినహాయింపు కోరుతూ విజయ్‌ హైకోర్టును ఆశ్రయించగా.. ఆ పిటిషన్‌ను న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఎం సుబ్రమణియన్‌ కొట్టివేశారు.

రూ.లక్ష జరిమానాను రెండు వారాల్లోగా ముఖ్యమంత్రి కొవిడ్‌ సహాయ నిధికి చెల్లించాలని ఆదేశించారు. సినిమాల్లో అవినీతి వ్యతిరేక పాత్రల్లో నటిస్తున్న హీరోలు పన్నులు కట్టడంలో విఫలమవుతున్నారని ఈ సందర్భంగా న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. తమిళ సినీ హీరోలు పాలకులుగా ఉన్నారని గుర్తు చేశారు. అందువల్ల ప్రజలు వారిని రియల్‌ హీరోలుగా చూస్తారన్నారు. రీల్‌ హీరోలు రియల్‌ హీరోలుగా నిలవాలని సూచించారు. పన్ను చెల్లించడం ప్రతి పౌరుడి విధి అన్నారు.Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని