మళ్లీ విషమంగా విజయ్‌కాంత్‌ ఆరోగ్యం! - vijayakanth heads abroad for medical treatment
close
Published : 31/08/2021 14:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మళ్లీ విషమంగా విజయ్‌కాంత్‌ ఆరోగ్యం!

 

చైన్నై: తమిళ నటుడు, డీఎండీకే  అధినేత విజయ్‌కాంత్‌ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. అమెరికా, సింగపూర్‌లలో చికిత్స చేయించుకున్నప్పటికీ ఆరోగ్యం మెరుగుపడలేదు. అనారోగ్య కారణాల వల్ల  సినిమాలకు దూరమైన విజయ్‌కాంత్‌, పార్టీ బాధ్యతలను కూడా తన భార్యకు అప్పగించారు.  దీనికి తోడు సెకండ్‌ వేవ్‌లో కరోనా బారిన పడ్డారాయన. కొవిడ్‌ నుంచి కోలుకున్నా, ఆరోగ్యం మాత్రం కుదుటపడలేదు.  చైన్నైలోని ఓ ఆసుపత్రిలో తరచుగా వైద్య పరీక్షలకు వెళుతున్నారు.  తమిళనాడు  ఎన్నికల ప్రచారంలోనూ చురుగ్గా పాల్గొనలేకపోయారు. తాజాగా ఆరోగ్యం మళ్లీ విషమించడంతో విదేశాలకు ప్రయాణమయ్యారని తెలిసింది.  చెన్నై విమానాశ్రయంలో వీల్‌చైర్‌పై ఆయన వెళుతున్న దృశ్యాలు మీడియాకు బహిర్గతమయ్యాయి. లండన్‌కు చెందిన ఓ ప్రముఖ వైద్యుడు దుబాయ్‌లో చికిత్స చేస్తారని సమాచారం. మరోసారి విజయ్‌కాంత్‌ ఆరోగ్యంపై సందేహాలు వ్యక్తమవడంతో అభిమానులు, సన్నిహితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని