తమిళంలోనే మాట్లాడాలని మీకు చెప్పలేదా.. - viral video heres how ar rahman reacted to host talking in hindi at 99 songs audio launch
close
Published : 28/03/2021 01:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తమిళంలోనే మాట్లాడాలని మీకు చెప్పలేదా..

చెన్నై: అది చెన్నైలోని ఒక ప్రముఖహోటల్‌. సంగీత దిగ్గజం ఏఆర్‌ రెహమాన్‌ కథను రచించి, నిర్మించిన ‘99 సాంగ్స్‌’ప్రీ రిలీజ్‌ వేడుక జరుగుతున్న సందర్భం. యాంకర్‌ షరా మామూలుగా తమిళంలో ఆ కార్యక్రమాన్ని హోస్ట్‌ చేస్తోంది. ఇంతలో చిత్రంలోని హీరో ఇహాన్‌భట్‌కు  ‘చెన్నై మే ఆప్‌కా హార్థిక్‌ స్వాగత్‌ కర్తీ హూ’అంటూ  స్వాగతం పలకగానే ఒక్కసారిగా ఏఆర్‌ రెహమాన్‌ ‘హిందీనా? ’అంటూ యాంకర్‌ వైపు షాక్‌ తిన్నట్టు చూశారు. వెంటనే వడివడిగా స్టేజి దిగి కిందకు వెళ్లిపోసాగారు. యాంకర్‌ కంగారు పడి ‘సార్‌..సార్‌’అని పిలవడంతో రెహమాన్‌ సరదాగా నవ్వి ‘తమిళంలోనే మాట్లాడాలని నేనింకా మీకు చెప్పలేదా’ అని ప్రశ్నించగానే యాంకర్‌ తేరుకుని తను కూడా సరదాగా నవ్వేసింది. తమిళంలోనే మాట్లాడతానని చెప్పి తిరిగి మళ్లీ కార్యక్రమం హోస్ట్ చేసింది. వెంటనే స్జేజిపైకి వచ్చిన ఆయన ‘సరదాగా జోక్‌ చేశా’నంటూ నవ్వేశారు. దీంతో ఆ కార్యక్రమంలో ఉన్న ప్రేక్షకులు ఘొల్లున నవ్వారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. తమిళ ప్రజలు తమ భాషపై ఎంత అభిమానం చూపుతారో అందరికి తెలిసిందే. అలాగే ఈ కార్యక్రమానికి సంబంధించిన మరో వీడియో పంచుకున్న రెహమాన్‌ ‘ఇదొక అద్భుతమైన భావన, ఈ సినిమా ఆనందాన్ని మీతో పంచుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. మీ అందరి స్వచ్ఛమైన ప్రేమకు నా కృతజ్ఞతలు’ అంటూ రాసుకొచ్చారు. ఈ కార్యక్రమానికి  గౌతమ్‌మీనన్‌, జీవీ ప్రకాష్‌, శివ కార్తికేయన్‌, అనిరుథ్‌ వంటి కోలివుడ్‌ ప్రముఖులు హాజరయ్యారు. కాగా ‘99సాంగ్స్‌’ చిత్రం ఏప్రిల్‌ 16న థియేటర్లలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని