రానాతో విశ్వక్‌సేన్‌, తరుణ్‌ సందడి..! - viswak sen with rana
close
Published : 23/04/2021 01:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రానాతో విశ్వక్‌సేన్‌, తరుణ్‌ సందడి..!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ఈ నగరానికి ఏమైంది?’ చిత్రంతో హిట్‌ కాంబినేషన్‌ అనిపించుకున్నారు దర్శకుడు తరుణ్ భాస్కర్‌, నటుడు విశ్వక్‌ సేన్‌. ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి రానా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ‘నంబరు.1 యారి విత్‌ రానా ’ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేశారు. ఈ షోకి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. విశ్వక్‌ సేన్‌ తొలి ముద్దు ఏ వయసులో? ఇంట్లో ఒంటరిగా ఉంటే విశ్వక్‌ ఏం చేస్తాడు? అని రానా ప్రశ్నించగా విశ్వక్‌ చెప్పిన సమాధానాలు నవ్వులు పంచుతున్నాయి. వీటి మధ్యలో తరుణ్‌ భాస్కర్‌ చేసిన అల్లరి అలరిస్తోంది. టాంజానియా దేశ రాజధాని ఏంటి అని అడగ్గా.. ఇంత తేలిక ప్రశ్నా! నువ్వు చెప్పు అంటే నువ్వు చెప్పు అని తరుణ్‌, విశ్వక్‌ చేసిన సందడి మెప్పిస్తుంది. ఏప్రిల్‌ 25న పూర్తి కార్యక్రమం ఆహా (ఓటీటీ)లో ప్రసారం కానుంది. అప్పటి వరకు ఈ ప్రోమో చూసి ఆనందించండి..Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని