close
టాలీవుడ్‌
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
‘మిడిల్‌ క్లాస్‌ మెలోడీస్‌’ పూర్తి

ఆనంద్‌ దేవరకొండ, వర్ష బొల్లమ్మ జంటగా రూపొందుతున్న చిత్రం ‘మిడిల్‌ క్లాస్‌ మెలోడీస్‌’. ఈ సినిమాతో వినోద్‌ అనంతోజు దర్శకునిగా పరిచయమవుతున్నారు. వి.ఆనందప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా మొత్తం చిత్రీకరణ పూర్తి చేసుకున్నట్లు నిర్మాత శుక్రవారం తెలిపారు. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని వివరించారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ..‘‘మామూలు మనుషుల జీవితాల్లో ఉండే సున్నితమైన హాస్యాన్ని సినిమాలో చూపించాం. ప్రతి ఒక్కరు ఇందులో తమను తాము పోల్చుకోగలుగుతారు’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: స్వీకర్‌ అగస్తి, కెమెరా: సన్నీ కూరపాటి, కథ, సంభాషణలు: జనార్దన్‌ పసుమర్తి, కూర్పు: రవితేజ గిరిజాల.


తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.