close
టాలీవుడ్‌
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
టీజర్ల ముగ్గులు.. పోస్టర్ల తోరణాలు

టీజర్లు... భోగిమంటల్లా వెలిగాయి.  పోస్టర్లు... వాకిట్లో తోరణాల్లా మెరిశాయి. ట్రైలర్లు... ముగ్గులతో మెరుస్తున్న మన లోగిళ్లలా కళకళలాడాయి. కొత్త సంభాషణలు, కొత్త విడుదల తేదీలు... కొత్త నేపథ్యాలు, కొత్త కథలు... మకర సంక్రాంతికి... సినిమా కాంతి తోడైంది. తెలుగు ప్రేక్షకులకు పండగ ఆనందం రెట్టింపైంది.
మనకే కాదు... మన సినిమాకి పెద్ద పండగ సంక్రాంతి. ఒక పక్క కొత్త చిత్రాలు వరుస కడుతుంటే... మరోపక్క సెట్స్‌పై ఉన్న సినిమాలు ప్రచారంతో సందడి చేస్తుంటాయి. లుక్కులు, టీజర్లు, ట్రైలర్లు, విడుదల తేదీల వివరాలు బయటికొస్తుంటాయి. ఎప్పట్లాగే ఈసారి పండక్కి నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. సెట్స్‌పై ఉన్న కొత్త చిత్రాలు ప్రచారంలో జోరు పెంచి... ప్రేక్షకుల్ని ఆకర్షిస్తున్నాయి. అఖిల్‌ అక్కినేని కథానాయకుడిగా నటిస్తున్న ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’, రానా దగ్గుబాటి కథానాయకుడిగా నటిస్తున్న ‘విరాటపర్వం’ సినిమాల సంక్రాంతి పోస్టర్లు విడుదలయ్యాయి. ఈ రెండు చిత్రాలూ వేసవి సందర్భంగా విడుదల కానున్నాయి.

* వైష్ణవ్‌ తేజ్‌ కథానాయకుడిగా నటించిన ‘ఉప్పెన’ టీజర్‌ విడుదలైంది. ప్రేమలో మునిగి తేలండి... అంటూ ఊరిస్తోంది చిత్రబృందం.
* వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌ల ‘ఎఫ్‌3’ పోస్టర్‌ విడుదలైంది.
* సుమంత్‌ కథానాయకుడిగా నటించిన ‘కపటధారి’ ట్రైలర్‌ని నాగచైతన్య, సమంత జంట విడుదల చేసింది. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
* మన దేశంలో 7 భాషల్లో విడుదల కానున్న ఉపేంద్ర పాన్‌ ఇండియా ‘కబ్జా’ పోస్టర్‌ని కూడా విడుదల చేశారు. ఇందులో మరో అగ్ర కథానాయకుడు సుదీప్‌ నటిస్తున్నట్టు ప్రకటించారు. ఆయన పోషిస్తున్న భార్గవ్‌ భక్షి లుక్‌ని విడుదల చేశారు.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు