close
అవీ.. ఇవీ..
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
శేఖర్‌ కమ్ములకు పితృవియోగం

హైదరాబాద్‌: ప్రముఖ దర్శకుడు శేఖర్‌ కమ్ముల ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి కమ్ముల శేషయ్య(89) శనివారం ఉదయం మృతి చెందారు. శేషయ్య గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.

ఈ సాయంత్రం సికింద్రాబాద్‌ బన్సీలాల్‌పేటలోని శ్మశాన వాటికలో శేషయ్య అంతక్రియలు నిర్వహించనున్నట్లు శేఖర్‌ కమ్ముల కుటుంబసభ్యులు తెలిపారు. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య-సాయిపల్లవి నటిస్తున్న లవ్‌స్టోరీ చిత్రాన్ని ఇటీవల కమ్ముల శేషయ్య క్లాప్‌ కొట్టి లాంఛనంగా ప్రారంభించిన విషయం తెలిసిందే.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.