ఏంచేస్తాం.. పాత్రల ప్రభావం పడింది! - suryakantham and nagaiah
close
Published : 23/03/2021 16:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఏంచేస్తాం.. పాత్రల ప్రభావం పడింది!

ఇంటర్నెట్‌డెస్క్‌: ‌‘‌‘ధరించే పాత్రల ప్రభావం నటుల మీద పడు‌తుందా?’‌’‌ అని అడి‌గితే, కొందరి మీద పడు‌తుంది.‌ విలన్‌ పాత్రలు ధరించే వాళ్లు బయ‌ట‌కూడా‌ అలా క్రూరంగా ప్రవ‌ర్తి‌స్తారా? ప్రవ‌ర్తించిన వాళ్లు‌న్నారు. అయితే అందరూ కాదు.‌ ఇలాంటి వారిలో నాగయ్య, సూర్యకాంతం వాళ్లకు సంబంధించిన కొన్ని ఉదంతాలను చెప్పుకోవాలి.

చిత్తూరు నాగయ్య పోతన పాత్ర చేసిన తర్వాత పూర్తిగా రామ‌ భ‌క్తు‌ల‌యి‌పో‌యారు.‌ వేమన పాత్రతో సాధు‌వ‌ర్తనం అల‌వాటు చేసు‌కు‌న్నారు.‌ ‌‘‌‘అంత‌కు‌ముందు నాకు బాగా కోపం ఉండేది.‌ తర్వాత తగ్గి‌పో‌యింది’‌’‌ అని చెప్పేవారట నాగయ్య.
సూర్యకాంతం గయ్యాళి పాత్రధారి.‌ మనసు మంచిదే అయినా, బయట కూడా సంద‌ర్భాన్ని బట్టి కోపం వచ్చి ‌‘గయ్యాళి’‌గా అరి‌చే‌వారు.‌ ఒక‌సారి, షూటింగ్‌ కోసం హైదరాబాద్‌ వచ్చి సారథి స్టూడి‌యో‌లో ‌ఉన్న కాంటీ‌న్‌లో‌ సాయం‌కాలం పకోడి వెయ్యమన్నారు.‌ సాయంత్రమవగానే ‌‘అంద‌రికీ పకోడి తీసు‌కురా’‌ అని ఆమె, ప్రొడక్షన్‌ వాళ్లకి చెబితే, అత‌గాడు వెళ్లి ‌‘పకోడి వేయలేదమ్మా.. బజ్జీ వేశాడట‌’‌ అని చెప్పారు.‌

ఇక చూడాలి, ఆమె ప్రతాపం! ఆ క్యాంటీన్‌ అధి‌కా‌రిపై విరుచుకుపడ్డారు.‌ ‌‌‘చెప్పి‌న‌ప్పుడు చేస్తా‌నని ఎందు‌క‌న్నావు? చెయ్యలే‌క‌పోతే నాకొచ్చి చెప్పాలా లేదా? నీ ఇష్టం వచ్చి‌నట్టు నువ్వు చెయ్యడం ఏమిటి? ఈ బజ్జీలు నేను చెయ్యమ‌న‌లేదు.‌ నేను డబ్బు ఇవ్వను.‌ నీ ఇష్టం వచ్చి‌న‌వా‌డికి చెప్పుకో. మరో మాట మాట్లా‌డా‌వంటే, పెద్దవా‌ళ్లతో చెప్పి నీ క్యాంటీన్‌  ఎత్తించే‌య‌గ‌లను’‌ అని‌ విశ్వరూపం చూపించే ‌స‌రికి ఆ క్యాంటీన్‌ యజమాని సూర్యకాంతం కాళ్లపై పడ్డాడు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని