PUSHPA: శ్రీవల్లి చూపులకు పుష్పరాజ్‌ ఫిదా.. ఆకట్టుకునేలా సెకండ్‌ సింగిల్‌ - telugu news second single from pushpa out now
close
Updated : 13/10/2021 11:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

PUSHPA: శ్రీవల్లి చూపులకు పుష్పరాజ్‌ ఫిదా.. ఆకట్టుకునేలా సెకండ్‌ సింగిల్‌

హైదరాబాద్: ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ అభిమానులకు దసరా కానుక రెండురోజుల ముందే వచ్చేసింది. ఆయన కథానాయకుడిగా పుష్పరాజ్‌ పాత్రలో నటిస్తున్న ‘పుష్ప’ సినిమా నుంచి ఓ సరికొత్త పాటను విడుదల చేశారు. ‘చూపే బంగారమాయెనే  శ్రీవల్లి.. మాటే మాణిక్యమాయెనే’ అంటూ సాగే ఈ పాటను తాజాగా చిత్రబృందం సోషల్‌మీడియాలో అభిమానులతో పంచుకొంది. తన ప్రేయసి శ్రీవల్లి(రష్మిక) చూపులకు ముగ్ధుడై.. ఆమెపై తనకున్న ప్రేమను పుష్పరాజ్‌ తెలియజేస్తున్నట్లు ఈ పాటను తీర్చిదిద్దారు. దేవిశ్రీ స్వరాలు అందించగా సిద్ధ్‌ శ్రీరామ్‌ ఈ పాటను అలపించారు. మరోవైపు ఇప్పటికే విడుదలైన ‘దాక్కో దాక్కో మేక’ పాట సినీ ప్రియుల్ని ఎంతగానో అలరిస్తోంది.

‘ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత బన్నీ-సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న హ్యాట్రిక్‌ చిత్రమిది. ఇందులో బన్నీ.. ఎర్రచందనం స్మగ్లర్‌గా ఊరమాస్‌ లుక్‌లో కనిపించనున్నారు. ఈ సినిమా కోసం మొదటిసారి రష్మిక.. బన్నీతో స్క్రీన్‌ షేర్‌ చేసుకుంటున్నారు. ఇందులో ఆమె శ్రీవల్లి పాత్రలో పుష్పరాజ్‌ ప్రేయసిగా సందడి చేయనున్నారు. మైత్రిమూవీ మేకర్స్‌ పతాకంపై ఈ సినిమా నిర్మితమవుతోంది. భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న ఈచిత్రాన్ని డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ప్రస్తుతం ఈ సినిమాలోని కీలక సన్నివేశాలను తెలుగు రాష్ట్రాల్లోని అటవీ ప్రాంతాల్లో చిత్రీకరిస్తున్నారు.



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని