close
అవీ.. ఇవీ..
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కాజల్‌ సోదరి భావోద్వేగం: తిరుమలలో మంచులక్ష్మి

సోషల్‌ లుక్‌: తారలు పంచుకున్న విశేషాలు..

* కాజల్‌ పెళ్లి వేడుకలో ఆమె సోదరి నిషా అగర్వాల్‌ భావోద్వేగానికి గురయ్యారు. మెహందీ వేడుక సమయంలో ఆమె కంటతడి పెట్టుకున్న సందర్భంలో తీసిన బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫొటోను కాజల్‌ షేర్‌ చేశారు.

* అదా శర్మ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘క్వశ్చన్‌ మార్క్‌’. శ్రీ కృష్ణ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమాకు విప్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలోని ప్రత్యేక గీతాన్ని శుక్రవారం విడుదల చేశారు.  ‘రామసక్కనోడివిరా పిలగో..’ అంటూ సాగే ఈ పాటకు సంగీత దర్శకుడు రఘు కుంచె సారథ్యంలో బండి సత్యం సాహిత్యాన్ని సమకూర్చగా.. మంగ్లీ ఆలపించారు.

* తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని టాలీవుడ్‌ నటులు మంచు లక్ష్మి, మంచు విష్ణు దర్శించుకున్నారు. దేవుడ్ని నమ్మి ముందడుగు వేస్తే ఎంతటి కష్టతరమైన సమస్యనైనా ఎదుర్కోవచ్చని ఈ సందర్భంగా మంచు లక్ష్మి పోస్ట్‌ చేశారు. తిరుమల ఆలయ ప్రాంగణంలో తీసుకున్న ఫొటోలు షేర్‌ చేశారు.

* కథానాయిక శ్రుతి హాసన్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్స్‌ సంఖ్య 15 మిలియన్లకు చేరింది. ఈ సందర్భంగా తన అభిమానులకు ధన్యవాదాలు చెబుతూ ఆమె ప్రత్యేక పోస్ట్‌ చేశారు.

* బాలీవుడ్‌ నటి కరీనా కపూర్‌ తన తల్లి దగ్గర హెడ్‌ మసాజ్‌ చేయించుకున్నారు. త్వరలో రెండో శిశువుకు జన్మనివ్వబోతున్న ఆమె ఇంట్లోనే సమయం గడుపుతున్నారు. ‘అమ్మ చేతి మసాజ్‌’ అంటూ శుక్రవారం ఫొటో షేర్‌ చేశారు.
















Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.