
హైదరాబాద్: వెండితెరకు దూరమైన ఎంతో మంది నటీనటులు ఇప్పుడు ఎక్కడున్నారు..? ఎలా ఉన్నారు..? ఇలాంటివి తెలుసుకొని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది ‘ఆలీతో సరదాగా’. వారి జీవిత విశేషాలను, సినీ రంగంలో ఎదుర్కొన్న ఆటుపోట్లను ప్రేక్షకులకు తెలియజేస్తోందీ ‘ఆలీతో సరదాగా’. వారం వారం సెలబ్రెటీల మాట-ముచ్చట్లతో ప్రేక్షకులకు కనువిందు చేస్తోంది. ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే ఈ కార్యక్రమంలో కోట శ్రీనివాసరావు-బాబుమోహన్ పాల్గొని తమ జీవితాలలో ఎదుర్కొన్న సవాళ్లను, బాధలతో పాటు మరిన్ని ఆసక్తికర విషయాలను పంచుకోనున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో విడుదలయింది.
షోలో భాగంగా ‘మీ ఇద్దరిలో ఎవరు చిన్న’అని ఆలీ అడుగగా ‘నేనే’ అని బాబు చెప్పారు. ఆ వెంటనే కోటా శ్రీనివాస్‌రావు స్పందిస్తూ.. ‘రేఖలను చూసి చెప్పేది నిలిచి ఉండదు. విలువలను చూసి చెప్పేది నిలిచి ఉంటుంది’ అని వివరించారు. ఇలా ఒకరికొనకు సరదాగా ఆటపట్టించుకున్నారు. మీరిద్దరూ ఎక్కడ కలిశారు అని ఆలీ అడుగగా.. ‘మీకు తెలిసి ఉంటది ఆలీ గారు, చెప్పవయ్యా, ఏంటివయ్యా’ అంటూ సరదాగా నవ్వులు పూయించారు. ఆ తర్వాత ‘పెద్ద గుమ్మడికాయంత ప్రతిభ ఉంటే సరిపోదు... ఆవగింజంత అదృష్టం ఉండాలి. అదే నేను’ అంటూ కోట శ్రీనివాస్ అన్నారు. అలాగే యువతరాన్ని ఉద్దేశించి ‘ఓల్డ్ ఈజ్ గోల్డ్’ అనేది తెలిసిన మాట. కానీ, తెలుసుకోవాల్సింది ఏంటంటే ‘గోల్డ్ బోల్డ్‌గా మారదు’ అంటే ‘బంగారానికి సాన పెట్టిన కొద్ది మెరుగులు దిద్దుకుంటుంది’ అని ఆయన ప్రోమోలో చెప్పారు. మరి.. వీరిద్దరూ చెప్పిన మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే వచ్చే సోమవారం (నవంబర్ 30)న ప్రసారం కానున్న ‘ఆలీతో సరదాగా’ చూడాల్సిందే..!
తాజా వార్తలు
టాలీవుడ్
ఫోటోలు
హీరో మరిన్ని
హీరోయిన్ మరిన్ని
సినిమా స్టిల్స్ మరిన్ని
ఈవెంట్స్ మరిన్ని

దేవతార్చన
- ఇన్‌కాగ్నిటో నిజంగా పనిచేస్తుందా?
- చరిత్ర సృష్టించిన నయా యార్కర్ కింగ్
- ‘నా మృతదేహాన్ని వాటికి ఆహారంగా వేయండి’
- తమన్నా చీట్: సాయేషా డ్యాన్స్: మంచు కుటుంబం
- ఫిట్‌గా ఉన్నా.. గుండెపోటు వస్తుందా?
- అరెరె షా.. రోహిత్‌కు కోపం తెప్పించేశావ్‌గా!
- ఒంటెను ఢీకొని బెంగళూరు ఫేమస్ బైకర్ మృతి
- సస్పెన్స్‌కు తెరదించిన శతాబ్ది రాయ్
- మెగా కాంపౌండ్‌లో మ్యూజికల్ నైట్
- యూట్యూబర్ తప్పుడు రివ్యూ.. మూతపడ్డ హోటల్