సందడి చేసిన నాగార్జున
వైరల్‌గా మారిన ఫొటోలు
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి నివాసంలో సంక్రాంతి వేడుకలు గత రెండు రోజులుగా సందడిగా జరుగుతున్నాయి. బుధవారం ఉదయం ఇంటి ఆవరణలో భోగి మంటలతో ఈ వేడుకలను ప్రారంభించిన మెగా ఫ్యామిలీ.. దానికి సంబంధించిన ఫొటోలను సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఈ వేడుకల్లో చిరంజీవి, నాగబాబు కుటుంబాలతోపాటు ఉపాసన-చెర్రీ, బన్నీ ఫ్యామిలీ, సాయిధరమ్‌తేజ్, వైష్ణవ్ తేజ్, సుస్మితా దంపతులు, శ్రీజ దంపతులు పాల్గొన్నారు. కొత్తగా వివాహబంధంలోకి అడుగుపెట్టిన నిహారిక-చైతన్య వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
కాగా, తాజాగా సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం రాత్రి మెగా కాంపౌండ్‌లో మ్యూజికల్ నైట్ నిర్వహించారు. ఎంతో సందడిగా జరిగిన ఈ కార్యక్రమంలో అక్కినేని నాగార్జున సందడి చేశారు. కార్యక్రమం అనంతరం మెగా హీరోలతో నాగార్జున కలిసి దిగిన ఓ ఫొటో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇదిలా ఉండగా మ్యూజికల్ నైట్‌లో భాగంగా చిరంజీవి చిన్నల్లుడు, నటుడు కల్యాణ్‌దేవ్ ‘యమహానగరి’ పాట పాడి అందర్నీ అలరించారు.
ఇదీ చదవండి
మరిన్ని
కొత్త సినిమాలు
-
సందీప్ ఆట సుమ మాట
- కీర్తి.. కొత్త ప్రయాణం
-
‘ప్రాణం పోయినా వదిలిపెట్టను’ అంటోన్న యశ్
-
థియేటర్లు దద్దరిల్లేలా నవ్వటం ఖాయం..!
-
దొంగల ‘హౌస్ అరెస్ట్’
గుసగుసలు
- మోహన్‌బాబు సరసన మీనా!
- ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేసిన రష్మిక..?
- ‘ఆర్సీ 15’.. సంగీత దర్శకుడు అతనేనా?
- మూడో చిత్రం ఖరారైందా?
- పవన్-మహేశ్ పోటీ పడనున్నారా?
రివ్యూ
ఇంటర్వ్యూ
- ఆ కల ‘శివ’తోనే తీరిపోయింది!
-
రొటీన్ పాత్రలు చేసి బోర్ కొట్టింది: లావణ్య
-
‘చెక్’ ఒక ట్రెండ్‌సెట్టర్ అవుతుంది
- నా సినీ భవిష్యత్తును తేల్చే చిత్రమిది!
- డైరెక్టర్ నన్ను నమ్మితే చాలు: నందితాశ్వేత
కొత్త పాట గురూ
-
స్ఫూర్తినిస్తోన్న ‘శ్రీకారం’ టైటిల్ గీతం
-
మాస్ స్టెప్లతో అదరగొట్టిన అనసూయ
-
నిశినలా విసురుతూ..శశినువ్వై మెరవగా
-
‘బతుకే బస్టాండ్..’ అంటూ నితిన్ చిందులు!
-
‘పద్మవ్యూహం లోనికి..’ సుశాంత్!