Samantha: మొత్తానికి నా కల నెరవేరింది - samanth trip char dam yata holiday time
close
Published : 24/10/2021 01:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Samantha: మొత్తానికి నా కల నెరవేరింది

మహాభారతం చదవినప్పటి నుంచి హిమాలయాలను చూడాలనుకున్నా

ఇప్పటికి నా కలతీరింది

ఇంటర్నెట్‌ డెస్క్‌: టాలీవుడ్ కథానాయిక సమంత.. నాగచైతన్యతో వైవాహిక జీవితానికి ముగింపు పలికిన తరువాత.. కెరీర్‌ పై దృష్టి పెట్టింది. వరుసగా తన తదుపరి చిత్రాల అప్‌డేట్‌ను దసరా రోజు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇటీవలే సామ్‌.. తన స్నేహితురాలు, ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ శిల్పారెడ్డితో కలిసి ‘ఛార్‌ధామ్‌ యాత్ర’ (గంగోత్రి, యమునోత్రి, కేదార్‌నాథ్‌, బద్రినాథ్‌) పుణ్యక్షేత్రాల సందర్శనను పూర్తి చేసుకున్నారు. శనివారం ఇదే విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. యాత్ర గురించి చెబుతూ ‘‘నా జీవితంలో హిమాలయాలకు ప్రత్యేక స్థానం ఉంది. మహాభారతం చదివినప్పటి నుంచి హిమాలయాల గురించి ఆకర్షితులరాలినయ్యాను. భూమి పై ఉన్న ఈ స్వర్గం, దేవుళ్ల నివాసం, గొప్ప రహస్యమే ఈ ప్రదేశం. ఎప్పటికైనా వీటిని చూడాలనే కల ఈ రోజుతో నెరవేరింది. అనుకున్నట్లు గానే దేవతల నిలయమైన ఈ అందమైన భూలోక స్వర్గాన్ని చూశాను. ఈ ట్రిప్‌ అంతా మరింత స్పెషల్‌గా నిలవడానికి కారణం నా స్నేహితురాలు, సోదరి శిల్పారెడ్డితో కలిసి చూడటం వల్లే’’ అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు.


రిషికేష్‌లో..   

రిషికేష్‌లోకి అడుగుపెట్టిన సామ్ అక్కడ సందర్శించిన ప్రఖ్యాత మహర్షి మహేష్‌ యోగి ఆశ్రమ విశేషాల గురించి చెబుతూ... ‘ ది బీటెల్స్‌’( ఇంగ్లిష్‌ రాక్‌ బ్యాండ్‌) నడిచిన చోట అడుగుపెట్టా. ఇక్కడే వారు ధ్యానం చేసేవారట. ఇక్కడే కూర్చొని ప్రసిద్ధి చెందిన పాటలు రాశారట.  వీటన్నింటికీ నేను పెద్ద అభిమానిని.


 యమునోత్రిలో..


 








మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని