10 నిమిషాల్లో 12 కోట్లు లూటీ

తాజా వార్తలు

Updated : 20/11/2020 01:56 IST

10 నిమిషాల్లో 12 కోట్లు లూటీ

ఫైనాన్స్‌ సంస్థలో బంగారం, నగదు దోచుకున్న దుండగులు
ఒడిశాలో ఘటన

భువనేశ్వర్‌:  ఒడిశాలోని కటక్‌ నగరంఓ అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో భారీ చోరీ జరిగింది.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఐఐఎఫ్‌ఎల్‌ ఫైనాన్స్‌ సంస్థ ఉద్యోగులు గురువారం ఉదయం యథావిధిగా తమ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఆ సమయంలో ఆయుధాలు ధరించిన నలుగురు దుండగులు కార్యాలయంలోనికి ప్రవేశించి, తుపాకీతో సెక్యూరిటీ గార్డును బెదిరించారు. అనంతరం బ్రాంచ్‌మేనేజర్‌ను, ఇతర ఉద్యోగులను బాత్‌రూమ్‌లో బంధించారు. వారి వద్ద నుంచి లాకర్ల తాళాలు లాక్కున్నారు.  కొంత బంగారాన్ని మాత్రం వదిలి మొత్తం తీసుకువెళ్లారని బ్రాంచ్‌ మేనేజర్‌ సత్య ప్రధాన్‌ తెలిపారు.  చోరీ జరిగిన వస్తువులు, నగదు విలువ సుమారు రూ. 12 కోట్లు ఉంటుందని తెలిపారు. ఇదంతా కేవలం పది నిమషాల్లో జరిగిపోయిందన్నారు. వచ్చిన దుండగులు హిందీ, ఒడియా భాషల్లో మాట్లాడినట్లు ఆయన వెల్లడించారు.

చోరీ జరిగిన సమయంలో బ్రాంచ్‌లో సీసీటీవీ పనిచేయట్లేదని ఆయన తెలిపారు. కటక్‌ డీసీపీ ప్రతీక్‌సింగ్‌ మాట్లాడుతూ నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు.  నగర సరిహద్దుల్లో నిఘా పెంచామని తెలిపారు.  చుట్టుపక్కల ప్రాంతాల్లోని పోలీసులను అప్రమత్తం చేశామని తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఐఐఎఫ్‌ఎల్‌ లూథియానా బ్రాంచ్‌లో కూడా ఇదే విధంగా చోరీ జరిగింది. సుమారు రూ. 13 కోట్ల విలువైన నగదు, బంగారం అపహరించారు. గత నెల పోలీసు కమిషనర్‌ నగరంలోని అన్ని సంస్థలు, ఏటీఎమ్‌లు భద్రతా ప్రమాణాలపై దృష్టి సారించాలని సూచించినా కొందరి నిర్లక్ష్యంతో చోరీలు జరుగుతూనే ఉన్నాయి. రేపటి నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఈ చోరీ జరగడం గమనార్హం.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని