గ్రనేడ్‌ దాడి: జవాన్లకు తప్పిన ప్రమాదం

తాజా వార్తలు

Published : 19/11/2020 02:18 IST

గ్రనేడ్‌ దాడి: జవాన్లకు తప్పిన ప్రమాదం

12మంది పౌరులకు గాయాలు

పుల్వామా: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఆగడాలు రోజురోజుకీ  హద్దుమీరిపోతున్నాయి. బుధవారం పుల్వామాలో సీఆర్పీఎఫ్‌ జవాన్లను లక్ష్యంగా చేసుకొని ఆ ముష్కరులు గ్రనేడ్‌ దాడికి పాల్పడ్డారు. అయితే, ఆ గ్రనేడ్‌ గురి తప్పి రహదారిపై పడటంతో 12మంది సాధారణ పౌరులకు గాయాలైనట్టు పోలీసులు తెలిపారు. గుర్తు తెలియని కొందరు ఉగ్రవాదులు కాకాపొరా చౌక్‌ సమీపంలో గ్రనేడ్‌‌ విసిరారన్నారు. ఈ ఘటనలో సీఆర్పీఎఫ్‌ సిబ్బంది ఎవరికీ గాయాలు కాలేదని స్పష్టం చేశారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించామన్నారు. ఆ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేసి ఉగ్రవాదులను పట్టుకొనేందుకు సోదాలు కొనసాగిస్తున్నట్టు అధికారులు తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని