యూపీలో పరువు హత్య!

తాజా వార్తలు

Published : 08/10/2020 01:55 IST

యూపీలో పరువు హత్య!

లఖ్‌నవూ : ఇటీవల ఆడపిల్లలపై వరుస అఘాయిత్యాలు జరుగుతున్న ఉత్తరప్రదేశ్‌లోనే మరో దారుణం చోటు చేసుకుంది. పెళ్లి కాకుండా గర్భవతి అయిందన్న కారణంతో ఓ తండ్రి మైనర్‌ బాలికను కిరాతకంగా హత్య చేశాడు. దీనికి తన పెద్ద కొడుకు సాయం తీసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూపీలోని దుల్హాన్‌పూర్‌ గ్రామానికి చెందిన ఓ అమ్మాయి ఓ వ్యక్తితో సన్నిహితంగా ఉండి గర్భవతి అయ్యింది. కూతురు ఆరు నెలల గర్భవతిగా ఉన్న సమయంలో గుర్తించిన తండ్రి దానికి కారణమైన వ్యక్తి గురించి ఆరా తీశాడు. అయితే ఎవరికైనా తన గురించి చెబితే గొంతు నులిమి చంపేస్తానని ఆ వ్యక్తి బాలికను బెదిరించాడు. దీంతో అతడి గురించి ఇంట్లో వాళ్లు ఎంత అడిగినా చెప్పలేదు. కూతురిపై కోపం పెంచుకున్న తండ్రి తన పెద్ద కొడుకు సాయంతో గత నెల 24న ఆమెను హత్య చేశాడు. అనంతరం తల నరికి దగ్గర్లోని కాలువలో పడేశాడు.

గ్రామానికి సమీపంలో మంగళవారం గ్రామస్థులకు బాలిక మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారం తెలియజేశారు. రెండు వారాల నుంచి కూతురు కనిపించకపోయినా పోలీసులను ఆశ్రయించని తండ్రిని కస్టడీలోకి తీసుకొని విచారించారు. దీంతో తనే నేరం చేసినట్లు తండ్రి ఒప్పుకున్నాడని స్థానిక ఎస్పీ తెలిపారు. అతడి పెద్ద కుమారుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. బాలిక గర్భవతి కావడానికి కారణమైన వ్యక్తిని పట్టుకోవడానికి గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసు ఉన్నతాధికారి పేర్కొన్నారు. ఈ కేసును పరువు హత్యగా భావించి బాలిక తండ్రిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని