తండ్రి పోటీలో ఉండొద్దని కుమార్తెపై అత్యాచారం!

తాజా వార్తలు

Published : 19/03/2021 01:48 IST

తండ్రి పోటీలో ఉండొద్దని కుమార్తెపై అత్యాచారం!

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లోని బారాబంకి జిల్లాలో అమానుషం చోటు చేసుకుంది. రానున్న పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయనీయకుండా ఓ వ్యక్తిని నిలువరించేందుకు ఆయన కుమార్తెపై నలుగురు దారుణానికి ఒడిగట్టారు. తొలుత కిడ్నాప్‌ చేసి ఆపై అత్యాచారానికి పాల్పడ్డారు. మంగళవారం జరిగిన ఈ ఘటనపై బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో తాను పోటీ చేయకుండా ఉండేందుకు తొలుత పలుమార్లు ప్రత్యర్థులు తనపై ఒత్తిళ్లు తెచ్చారని, డబ్బునూ ఆశ చూపారని బాధితురాలి తండ్రి పేర్కొన్నారు. వీటన్నింటినీ నిరాకరించడంతో పాఠశాల నుంచి తిరిగొస్తున్న తన కూతురిని ప్రత్యర్థులు (ఆకాశ్‌ వర్మ, లాల్‌జీ వర్మ, సచిన్‌ వర్మ, శివమ్‌ వర్మ) అపహరించి అఘాయిత్యానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్పీ మనోజ్‌పాండే తెలిపారు. నిందితుల్లో ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామన్నారు. వైద్య పరీక్షల నిమిత్తం బాలికను ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు.

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని