జమ్ముకశ్మీర్‌లో ఇద్దరు ఉగ్రవాదుల హతం

తాజా వార్తలు

Updated : 10/10/2020 11:38 IST

జమ్ముకశ్మీర్‌లో ఇద్దరు ఉగ్రవాదుల హతం

శ్రీనగర్‌: జమ్మూ కశ్మీర్‌లోని కుల్గామ్‌ జిల్లాలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. భద్రతా బలగాలతో కలిసి ఈ ఎన్‌కౌంటర్‌ చేసినట్లు కశ్మీర్‌ జోన్‌ పోలీసులు ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. కుల్గామ్‌లో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందుకున్న భద్రతా దళాలు శుక్రవారం సాయంత్రం పోలీసులతో కలిసి కూంబింగ్‌ నిర్వహించారు. దీంతో ముష్కరులు వీరిపై కాల్పులకు తెగబడ్డారు. అప్రమత్తమైన జవాన్లు వారిపై ఎదురు కాల్పులు జరిపి ఇద్దరిని హతమార్చారు. అక్టోబర్‌ 7వ తేదీన జమ్మూ కశ్మీర్‌లోని షోపియన్‌ జిల్లా సుగన్‌ జైనాపురా ప్రాంతంలో భద్రతా బలగాలు ముగ్గురు ముష్కరులను హతమార్చాయి. అదే తరహాలో సెప్టెంబర్‌ 7న అవంతిపురా జిల్లా సంబూర ప్రాంతంలో ఇద్దరు ముష్కరులను మట్టుబెట్టాయి. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని